IND Vs SA: అతడు బౌలింగ్ చేస్తాడు. మెల్బోర్న్ లాంటి క్రికెట్ గ్రౌండ్ లో కూడా అది కూడా జట్టు పీకల లోతు కష్టంలో ఉన్నప్పుడు సెంచరీ చేస్తాడు. ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో పాదరసం మాదిరిగా కదులుతుంటాడు.. వికెట్లను గురి చేసి కొట్టడంలో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఇన్ని క్వాలిటీలు ఉన్నప్పటికీ.. తుది జట్టులో చోటు లభించినప్పటికీ.. అతడికి ఆడే అవకాశం రాలేదు. ఇంతటి అవమానం ఎదుర్కొన్న ఆటగాడు మరెవరో కాదు.. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.
నితీష్ కుమార్ రెడ్డికి అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. టీమిండియాలో యువ ఆల్రౌండర్ గా అతడికి పేరు ఉంది.. పైగా ప్రఖ్యాత మెల్బోర్ క్రికెట్ గ్రౌండ్లో సెంచరీ చేసిన చరిత్ర కూడా ఉంది. అటువంటి నితీష్ కుమార్ రెడ్డికి ప్రస్తుతం టీమిండియాలో అన్యాయం జరుగుతోంది. ఒక రకంగా అతడికి ఘోరమైన అవమానం జరుగుతోంది.. నితీష్ కుమార్ రెడ్డి డిఫరెంట్ బౌలింగ్ వేస్తాడు. బ్యాటింగ్ కూడా అదే స్థాయిలో చేస్తాడు.
. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డిని కేవలం ఫీల్డింగ్ కోసం మాత్రమే మేనేజ్మెంట్ ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బౌలింగ్ బాగా వేసే అతడికి కెప్టెన్ పంత్ కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేసే అవకాశం ఇచ్చాడు. ఆరు ఓవర్లు వేసిన నితీష్ 25 పరుగులు ఇచ్చాడు. ఇదే క్రమంలో బుమ్రా తో 32, సిరాజ్ తో 30, వాషింగ్టన్ సుందర్ తో 26, కులదీప్ యాదవ్ తో 29, రవీంద్ర జడేజాతో 28 ఓవర్లు వేయించాడు.
జట్టులో ఆల్ రౌండర్ ఉన్నప్పుడు.. అతడు కొన్ని ఓవర్లలో పరుగులు బాగా ఇచ్చినప్పుడు. ఏ కెప్టెన్ అయినా సరే కాస్త విరామం ఇచ్చి మళ్లీ బౌలింగ్ ఇస్తాడు. అలాకాకుండా నితీష్ కుమార్ రెడ్డికి మొదటి రోజు 5 ఓవర్లు వేసే అవకాశం ఇచ్చిన పంత్.. రెండవ రోజు అది కూడా దక్షిణాఫ్రికాలో ఇన్నింగ్స్ చివర్లో మరో ఓవర్ ఇచ్చాడు.. వాస్తవానికి రెండో రోజు నితీష్ కు బౌలింగ్ ఇవ్వకపోయినా సరిపోయేది. అలాకాకుండా చివర్లో ఒక ఓవర్ ఇచ్చి పరువు తీశాడు పంత్.
వికెట్లు పడినప్పుడు.. ప్రత్యర్థి ప్లేయర్లు క్రీజ్ లో అలానే పాతుకుని పోయినప్పుడు సాధ్యమైనంత వరకు బౌలింగ్ లో వైవిద్యం చూపించడానికి కెప్టెన్ ప్రయత్నించాలి. అలాకాకుండా వరుసగా ఇద్దరు బౌలర్లతో బౌలింగ్ వేయించడం.. అది కూడా బౌలర్లు అలసిపోతుంటే మళ్ళీ వాళ్ళకే బౌలింగ్ ఇవ్వడం పంత్ చేసిన అతిపెద్ద తప్పు. వాస్తవానికి దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ బవుమా యాన్సెన్ కు బౌలింగ్ ఇచ్చాడు. కెప్టెన్ విరివిగా అవకాశాలు ఇవ్వడంతో యాన్సెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీకి దూరంలో నిలిచిపోయినప్పటికీ.. అద్భుతమైన దూకుడు కొనసాగించాడు.