https://oktelugu.com/

Ind vs SA 1st T20 Live : టి20ల లోనూ టీమిండియా కు అదే వ్యధ.. ఆటగాళ్లకు పట్టదా అభిమానుల బాధ?!

. ఓపెనర్ సంజు సాంసన్ (107) వీరోచితమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ.. మిగతా ఆటగాళ్లు తేలిపోయారు. కీలక సమయాలలో వికెట్లు పడేసుకున్నారు. అందువల్ల టీమిండియా భారీ స్కోర్ సాధించలేకపోయింది. దీంతో అభిమానులు ఆటగాళ్ల తీరు పట్ల.. వారి నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరంభ శూరత్వం అనే వ్యాఖ్యానికి అసలైన అర్థం చెప్పారని వ్యాఖ్యానిస్తున్నారు..

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2024 / 11:07 PM IST
    Follow us on

    Ind vs SA 1st T20 Live : ఆరంభ శూరత్వం.. అనే వాక్యం మీరు ఎప్పుడైనా చదివారా.. పోనీ నిజ జీవితంలో మీకు ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా… మీ గురించి కాస్త పక్కన పెడితే.. ఇది టీమిండియాకు వాస్తవంలో కనిపించింది. సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న తొలి ఇటువంటి మ్యాచ్లో అది కళ్ళ ముందు సాక్షాత్కరించింది. దీంతో సగటు భారతీయ అభిమానికి మళ్లీ బాధే మిగిలిపోయింది. వరుస వైఫల్యాలు ఎదురవుతున్నప్పటికీ.. ఆటగాళ్లు తమ తీరు మార్చుకోరా అనే శేష ప్రశ్న అలాగే ఉండిపోయింది.

    నాలుగు టి20 మ్యాచ్ల సీరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో భారత్ తలపడుతోంది. తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా సాగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 202 పరుగులు చేసింది. టి20 క్రికెట్లో 200 పరుగులు అంటే మామూలు విషయం కాదు. అయితే దక్షిణాఫ్రికా పై టీమ్ ఇండియా ఆడిన ఇన్నింగ్స్ చూసుకుంటే.. ఆ స్కోర్ తక్కువనే చెప్పాలి. ఓపెనర్ సంజు సాంసన్ (107) వీరోచితమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ.. మిగతా ఆటగాళ్లు తేలిపోయారు. కీలక సమయాలలో వికెట్లు పడేసుకున్నారు. అందువల్ల టీమిండియా భారీ స్కోర్ సాధించలేకపోయింది. దీంతో అభిమానులు ఆటగాళ్ల తీరు పట్ల.. వారి నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరంభ శూరత్వం అనే వ్యాఖ్యానికి అసలైన అర్థం చెప్పారని వ్యాఖ్యానిస్తున్నారు..

    ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి..

    టీమిండియా ఇన్నింగ్స్ ను అభిషేక్ శర్మ (7), సంజు ప్రారంభించారు. సంజు దూకుడుగా ఆడితే.. అభిషేక్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (21), తిలక్ వర్మ (33) పర్వాలేదనిపించారు. హార్దిక్ పాండ్యా (2), రింకూ సింగ్ (11), అక్షర్ పటేల్ (7), రవి బిష్ణోయ్(1) తేలిపోవడంతో భారత్ మరింత భారీ స్కోర్ చేయలేకపోయింది. సంజు క్రీజ్ లో ఉన్నంతవరకు చేతులెత్తేసిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. ఆ తర్వాత పట్టు బిగించారు. వరుసగా వికెట్లు పడగొట్టి టీమిండియా పై ఒత్తిడి పెంచారు. మరింత భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశారు. 15.4 ఓవర్ లో 175/4 సంజు వికెట్ కోల్పోయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత 4.2 ఓవర్లలో.. కేవలం 27 పరుగులు మాత్రమే జోడించి నాలుగు వికెట్లు కోల్పోవడం విశేషం. ఆటగాళ్లు పేలవమైన షాట్లు ఎంచుకొని అవుట్ అయ్యారు. దీంతో టీమిండియా మరింత భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆటగాళ్లు ఇలా వచ్చి అలా అవుటయి వెళ్లిపోతున్న నేపథ్యంలో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే కొంతమంది అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. “ఎన్నాళ్ళు ఈ వ్యధ భరించాలి. టీమిండియా మిడిల్ ఆర్డర్ ఇకపై బాగుపడదా? టెస్ట్, టి20 ఫార్మాట్ మాత్రమే మారుతుంది. ఆటగాళ్ల ఆట తీరు మాత్రం అలాగే ఉంటున్నది. ఇలాగైతే కష్టమే.. ఆటగాళ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.