IND Vs SA: టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నాయి. ఆదివారం ధోని పుట్టిన గడ్డ రాంచి వేదికగా తొలి వన్డే జరగనుంది. భారత జట్టుకు రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు. గాయం వల్ల అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా సిరీస్లో అదరగొట్టిన రోహిత్, విరాట్ ఈ సిరీస్ ద్వారా మళ్లీ మైదానంలో కనిపించబోతున్నారు. జైస్వాల్, రోహిత్ టీమ్ ఇండియా ఇన్నింగ్స్ మొదలుపెడతారు.
రాంచీ మైదానం స్లో పిచ్.. ఇక్కడ మంచు ప్రభావం అధికంగా ఉంటుంది.. కాబట్టి భారీ స్కోర్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. స్పిన్ బౌలర్లు కచ్చితంగా ప్రభావం చూపిస్తారు. తొలి 20 ఓవర్ల వరకు పేస్ బౌలర్లు సత్తా చూపించే అవకాశం ఉంటుంది. క్రీజ్ లో కాస్త నిలబడితే చాలు పరుగులు వాటంతట అవే వస్తాయి. . ఈ మ్యాచ్ టీమిండియా గెలవాలి అంటే.. భారత జట్టు సారథి టాస్ నెగ్గాలి.. టాస్ నెగ్గిన తర్వాత బౌలింగ్ ఎంచుకోవాలి. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తన మిస్టీరియస్ స్పిన్ బౌలింగ్ ద్వారా సత్తా చూపిస్తే టీమిండియా కు తిరుగుండదు.
రాంచి మైదానంలో భారత్ ఐదు వన్డేలు ఆడింది. ఇందులో మూడు గెలిచింది. రెండిట్లో ఓడింది. దాంట్లో ఫలితం తేలలేదు.. భారత్ ఈ మైదానంలో చివరిగా 2022లో వన్డే ఆడింది. ఆ మ్యాచ్లో టీమిండియా దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.. భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 94 మ్యాచ్లలో తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 51, టీమ్ ఇండియా 40 మ్యాచ్లలో విజయం సాధించాయి. మూడు మ్యాచ్లలో ఫలితం తేలలేదు. స్వదేశంలో దక్షిణాఫ్రికా తో ఆడిన 32 వన్డేలలో భారత్ 18 విజయాలు సాధించింది…
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 391 మ్యాచులు ఆడారు. ఆదివారం దక్షిణాఫ్రికా తొలి వన్డేలో భారత్ తరపున అత్యధిక మ్యాచ్లలో కలిసి ఆడిన భారత జోడిగా వీరిద్దరూ రికార్డ్ నెలకొల్ప బోతున్నారు. సచిన్ ద్రావిడ్ (391) పేరు మీద ఇప్పటివరకు ఈ రికార్డు ఉండేది.