https://oktelugu.com/

IND vs PAK : నేడు విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడతాడా.. ప్రాక్టీస్ సమయంలో గాయం.. టెన్షన్ లో అభిమానులు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) లో భాగంగా నేడు భారత జట్టు పాకిస్థాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు ముందు ఓ సంచలన వార్త ఒకటి బయటకు రావడంతో టీం ఇండియాతో పాటు అభిమానులందరూ కూడా టెన్షన్లో ఉన్నారు.

Written By: , Updated On : February 23, 2025 / 01:11 PM IST
IND VS PAK Match Virat Kohli

IND VS PAK Match Virat Kohli

Follow us on

IND vs PAK : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) లో భాగంగా నేడు భారత జట్టు పాకిస్థాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు ముందు ఓ సంచలన వార్త ఒకటి బయటకు రావడంతో టీం ఇండియాతో పాటు అభిమానులందరూ కూడా టెన్షన్లో ఉన్నారు. పాకిస్తాన్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. ప్రాక్టీస్ సెషన్ కోసం షెడ్యూల్ చేసిన సమయానికి 3 గంటల ముందుగానే మాజీ కెప్టెన్ దుబాయ్ స్టేడియాని చేరుకున్నారు. కోచింగ్ సిబ్బందితో కలిసి చెమటోడ్చాడు. విరాట్ కోహ్లీ పాదానికి ఐస్ ప్యాక్ కట్టుకుని ఉన్న ఫోటో ఒకటి బయటకు రావడంతో మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆందోళన మొదలైంది.

విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా తన ఫామ్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో కూడా అతను కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్థాన్‌(Pakistan)తో జరిగిన మ్యాచ్‌లలో ఈ దిగ్గజ ప్లేయర్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఆదివారం నాడు అభిమానులు మరోసారి తమ అభిమాన క్రికెటర్ నుంచి బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. మ్యాచ్ కు ముందు విరాట్ ఫోటో ఒకటి బయటకు రావడంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ మరో గంటలో ప్రారంభం కాబోతుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్లో(X) ఈ ఫోటో వైరల్ అవుతుంది. అందులో అతని ఎడమ కాలు మీద ఐస్ ప్యాక్ ఉంది. అతను కాలికి ఐస్ ప్యాక్ పెట్టుకుని నడుస్తూ కనిపించాడు. విరాట్ ఫిట్‌నెస్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. భారత మాజీ కెప్టెన్ ఫిట్‌గా ఉన్నాడా.. అతడు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటానికి సిద్ధంగా ఉన్నాడా అన్న సందేహాలు ఉన్నాయి.