IND Vs PAK: విరాట్.. విరాట్.. ఈ పేరుతో అబుదాబి మైదానం మారుమోగిపోయింది. అతడు బంతిని కొడుతుంటే పాకిస్తాన్ బౌలర్ల ముఖంలో నెత్తురు చుక్కలేకుండా పోయింది. అహ్మదాబాద్ వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత.. టచ్ లోకి వచ్చిన విరాట్.. పాకిస్తాన్ జట్టుతో అబుదాబి వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ చేశాడు. తద్వారా పాకిస్తాన్ మీద తన రికార్డును మరింత పదిలపరుచుకున్నాడు.
అబుదాబి వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం దిశగా ప్రయాణం సాగిస్తోంది. పాకిస్తాన్ అంటేనే ఒంటి కాలు మీద లేచే విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్ లోనూ అదరగొట్టాడు. తనదైన షాట్లు ఆడుతూ మైదానాన్ని హోరెత్తించాడు. అంతేకాదు పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు .. తద్వారా చాలా రోజుల తర్వాత తన పూర్వపు బ్యాటింగ్ జోరును ప్రదర్శించాడు. దీంతో అభిమానులు మైదానంలో కేరింతలు కొట్టారు. విరాట్ నామస్మరణతో హోరెత్తించారు. అభిమానుల జోరుకు తగ్గట్టుగానే విరాట్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.. 104 బంతుల్లో 87*(ఈ కథనం రాసే సమయానికి) పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు ఉన్నాయి. గత కొంతకాలంగా సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న విరాట్.. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడవ వన్డేలో టచ్ లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అయితే బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్లో విరాట్ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు. కానీ పాకిస్తాన్ పై మాత్రం అదరగొట్టాడు. ఏకంగా హాఫ్ సెంచరీ చేసి.. శతకానికి దగ్గరగా వస్తున్నాడు..
RCB ట్వీట్ అదిరింది
ఐపీఎల్ లో బెంగళూరు జుట్టు తరఫున విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. ఆ జట్టుకు కొన్ని పర్యాయాలు కెప్టెన్ గా కూడా పని చేశాడు. అయితే అతని ఆధ్వర్యంలో కూడా బెంగళూరు చాంపియన్ గా నిలలేకపోయింది. అయినప్పటికీ ఐపీఎల్లో అత్యంత విలువైన జట్టుగా బెంగళూరు ఆవిర్భవించింది. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ దిశగా వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీం ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది. అందులో భారత జెండా సగర్వంగా ఎగురుతుండగా.. విరాట్ కోహ్లీ పిడికిలి బిగించి నినాదం చేస్తున్నాడు. అతడి పక్కనే ఒక సింహం కూడా గర్జన చేస్తోంది. అంటే అబుదాబిలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 2017 నాటి ఓటమికి బదులు తీర్చుకున్నాడని.. పాకిస్తాన్ బౌలర్లపై సింహ గర్జన చేశాడని అని అర్థం వచ్చేలా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ పోస్టర్ రూపొందించింది. పోస్టర్ ను పోస్ట్ చేసిన క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. అంతేకాదు ట్విట్టర్లోనే ఈ ఫోటో ట్రెండింగ్ లో నిలిచింది. బెంగళూరు అభిమానులు ఈ ఫోటోను సామాజిక మాధ్యమాలలో తెగ షేర్ చేస్తున్నారు.
RCB POSTER FOR KING KOHLI. pic.twitter.com/QKnKt9EdJZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025