IND Vs PAK: కోహ్లీకి ఇదే చివరి కప్: పాకిస్తాన్ తో టీమిండియా కూర్పు ఇదే..

IND Vs PAK: ప్రపంచకప్ టీ20 సమరానికి రంగం సిద్ధమైంది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ యుద్ధం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మ్యాచ్ గా భారత్, పాకిస్తాన్ టీ20 ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ తో హై ఓల్టేజ్ నిండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు.కేవలం అందులో ఆటగాడిగా కొనసాగనున్నాడు. ఇక వన్డే ప్రపంచకప్ 2023లో […]

Written By: NARESH, Updated On : October 22, 2021 9:19 am
Follow us on

IND Vs PAK: ప్రపంచకప్ టీ20 సమరానికి రంగం సిద్ధమైంది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ యుద్ధం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మ్యాచ్ గా భారత్, పాకిస్తాన్ టీ20 ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ తో హై ఓల్టేజ్ నిండడం ఖాయంగా కనిపిస్తోంది.

india vs pakistan t20

ఈ ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు.కేవలం అందులో ఆటగాడిగా కొనసాగనున్నాడు. ఇక వన్డే ప్రపంచకప్ 2023లో ఉంది. అంటే ఇంకా రెండేళ్లు. అప్పటివరకు కోహ్లీ కెప్టెన్ గా ఉండడం డౌటే. అంటే ఇదే కెప్టెన్ గా కోహ్లీకి చివరి ఐసీసీ కప్.. ఈ కప్ అందుకుంటే అతడి జీవితంలో ఒక ప్రపంచకప్ సాధించిన సారథిగా ఉంటాడు.లేదంటే ఆ అవమాన భారం అతడిని జీవితాంతం వెంటాడుతోంది.

ఆటగాడిగా ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ. ఒక పరుగుల యంత్రం. అతడి ఆటలో, ఫిట్ నెస్ లో పోటీపడే ఆటగాళ్లు కనుచూపు మేరలో లేరు. సెంచరీలు, రికార్డులు, సగటుల్లో కోహ్లీ తర్వాతే ఎవరైనా.. అయితే కెప్టెన్ గా మాత్రం ఒక్క ఐసీసీ ట్రోఫీని అందివ్వలేక కోహ్లీ విఫలమవుతున్నాడు. అతడి నాయకత్వ లక్షణాలు మైనస్ గా మారాయి. ఈ క్రమంలోనే ఈ ప్రపంచకప్ తర్వాత కెప్టెన్ గా దిగిపోనున్న విరాట్ కోహ్లీకి ఈ కప్ ప్రత్యేకం. దీన్ని సాధించి సగర్వంగా తప్పుకోవాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే ప్రపంచకప్ టీ20లో భీకర ఫైట్ కు రంగం సిద్ధమైంది. భారత్, పాకిస్తాన్ ఫైట్ కు సమయం ఆసన్నమైంది. ఈ ఆదివారం జరుగున్న ఈ మ్యాచ్ తో పరుగుల ఆట పతాక స్థాయికి చేరనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఇరు దేశాలకే కాదు.. యావత్ క్రీడా అభిమానులకు ఆసక్తి రేపుతోంది. ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఇరు దేశాల మధ్య ఉగ్రవాదం, సర్జికల్ స్ట్రైక్ తో ఈ తీవ్రత మరింతగా పెరగనుంది. గెలుపును తమ దేశ ప్రతిష్టగా ఆటగాళ్లు భావిస్తారు. అయితే ఐసీసీ ఈవెంట్లో ఒక్క మ్యాచ్ లోనూ పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోని ఘనమైన రికార్డును కలిగిఉంది. దాన్ని సరి చేయాలని పాక్ రగిలిపోతోంది.

వార్మప్ మ్యాచ్ ల ద్వారా ఆటగాళ్లను పరీక్షించిన టీమిండియా తుది జట్టుపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఓపెనర్లుగా అదరగొట్టిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ డౌన్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తే మాత్రం సూర్యకుమార్ బెంచ్ కే పరిమితం అవుతాడు. అయితే పాకిస్తాన్ తో ఒత్తిడి కాబట్టి ఇషాన్ ను పక్కనపెట్టొచ్చు.

ఇక ఆ తర్వాత ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శార్ధుల్ ఠాకూర్ కు అవకాశం దక్కనుంది. భువనేశ్వర్ ను పక్కనపెట్టి మరీ శార్ధుల్ ను తీసుకునే చాన్స్ ఉంది. బుమ్రా, షమీ పేసర్లుగా ఆడడం ఖాయం. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చాన్స్ ఉంది. అతడు లేడంటే అశ్విన్ జట్టులోకి వస్తాడు.

-భారత జట్టు అంచనా
విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, షమీ, బుమ్రా, వరుణ్ చక్రవర్తి/అశ్విన్