Homeఎంటర్టైన్మెంట్Samantha: ఏదైనా నియంత్రణలో ఉంచుకుంటేనే మంచిదంటున్న .... సమంత

Samantha: ఏదైనా నియంత్రణలో ఉంచుకుంటేనే మంచిదంటున్న …. సమంత

Samantha: నేటి సమాజంలో సోషల్ మీడియా గురించి తెలియని వారుండరు. పల్లె నుంచి పట్టణాల వరకు వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఫేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ , ట్విట్టర్ ఖాతాలో ద్వారా ఎంత ఉపయోగం ఉందో అందరికీ తెలిసిన విషయమే. మారుమూలన ఉన్న గ్రామంలో కూడా టెక్నాలజీ అందుబాటులోకి రావడం… డిజిటల్ అందరూ అడుగులు వేయడంతో… ప్రతి ఒక్కరి అరచేతిలో ప్రపంచం కనిపిస్తుండటం లాంటివి చూస్తున్నాం. ఈ క్రమంలో సోషల్ మీడియా ప్రభావం అందరిపై పడుతోంది. తాజాగా ఈ మాద్యమాలను ఉపయోగించే విధానాన్ని బట్టి దాని పర్యవస్థానాలు ఎలా ఉంటాయనే అంశంపై సమంత స్పందించారు.

samantha sensational comments on social media usage

ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా సామ్ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా వల్ల గొప్ప ప్లస్‌లు, కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయని చెప్పారు. డిజిటల్ యుగం నడుస్తున్న ఈ రోజుల్లో నేను సోషల్ మీడియాకు దూరం అని ఎవరన్నా అంటే మాత్రం అది వాళ్ళ గొప్ప గుణమే అని తను అనుకొనని అన్నారు. ఏ అలవాటు అయిన మితంగా నియంత్రణలో ఉండాలి అని సలహా ఇచ్చారు. అందుకే ట్రోల్స్ విషయంలో తాను పెద్దగా రియాక్ట్ కాకుండా ఉంటానని వివరించారు.

ఒకవేళ రియాక్ట్ కావాల్సివస్తే అది మౌనం కంటే ఉత్తమమైనది అయి ఉండాలి అని సామ్ పేర్కొన్నారు. అయితే ఇందుకు గాను తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా కధనాలు ప్రచురించిన మూడు యూట్యూబ్ ఛానల్ పై కూకట్ పల్లి కోర్టులో… సమంత పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా సమంత వేసిన పిటిషన్ పై కూకట్ పల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమంత దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును ఈరోజు వెల్లడించనుంది. నిన్న కోర్టు సమయం ముగియడంతో తీర్పును రేపు ( అక్టోబర్ 22 ) వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించినట్లు తెలుస్తుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version