https://oktelugu.com/

Mahesh Babu: మహేశ్‌- త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా … మిస్ ఇండియా భామ

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మ‌హేశ్, దర్శకుడు ప‌ర‌శురాంతో చేస్తున్న ” స‌ర్కారు వారి పాట ” షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్‌ లతో సినిమాలకు కమిట్ అయ్యారు మహేశ్. అయితే త్రివిక్రమ్ తో ఆయన చేయబితున్న మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేశ్‌ సరసన అప్‌కమింగ్‌ మిస్‌ ఇండియా మీనాక్షి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 22, 2021 / 09:42 AM IST
    Follow us on

    Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మ‌హేశ్, దర్శకుడు ప‌ర‌శురాంతో చేస్తున్న ” స‌ర్కారు వారి పాట ” షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్‌ లతో సినిమాలకు కమిట్ అయ్యారు మహేశ్. అయితే త్రివిక్రమ్ తో ఆయన చేయబితున్న మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేశ్‌ సరసన అప్‌కమింగ్‌ మిస్‌ ఇండియా మీనాక్షి చౌదరి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇటీవల విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే మాస్‌ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో కూడా నటించే చాన్స్‌ కొట్టెసింది మీనాక్షి. ఈ క్రమంలోనే ఆమె త్రివిక్రమ్ – మహేశ్‌ కాంబినేషన్‌లో రాబోయే చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం.

    సర్కారు వారి పాట సినిమా షూట్ లో బిజీగా ఉన్న మహేశ్… ఈ మూవీ పూర్త‌యిన వెంట‌నే త్రివిక్ర‌మ్ చిత్రాన్నిసెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా… తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.