India Vs Pakistan World Cup: ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది.ఇక ఇప్పటికే ఈ మ్యాచ్ విజయం గురించి అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా మాత్రం పాకిస్థాన్ ని డామినేట్ చేస్తూ ఈ మ్యాచ్ లో విజయం సాధించడం అనేది ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది.ఇక ఇప్పటివరకు వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మన మీద ఏడుసార్లు ఓడిపోయింది దీంతో ఎనిమిదో సారి కూడా ఇండియా పైన ఓడిపోయి ఇండియన్ టీమ్ ని ఓడించడం అంటే అంత ఈజీ కాదు అనే విషయాన్ని మరోసారి తెలుసుకుంది.
ఇక ఇలాంటి క్రమంలో ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్ టీం గా కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి మ్యాచు గెలుచుకుంటూ వెళ్తేనే ఇండియా కి వరల్డ్ కప్ వస్తుంది.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మ్యాచ్ చూస్తున్న చాలామంది ఇండియన్ అభిమానులు గ్రౌండ్ లో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసారు. అయితే గ్రౌండ్ లో బ్యాగ్రౌండ్ లో దేవుడికి సంబంధించిన పాటలు వస్తూ ఉండటం వల్ల ఆ పాటకు అనుకూలంగానే గ్రౌండ్ లో కూర్చున్న అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ పాటను పాడుతూ జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ భారీ అరుపులు అరవడం జరిగింది.ఇక స్టేడియం మొత్తం ఆరుపులతోనే ప్రతిధ్వనించిందనే చెప్పాలి. అయితే స్టేడియంలో అభిమానులు అలా అనడానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకు అంటే పాకిస్తాన్ తో మ్యాచ్ కాబట్టి వాళ్లకు హిందూ దేవుళ్ళు అంటే పడదు కాబట్టి స్టేడియం లో ఉన్న అభిమానులు అందరూ జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున అరుపులు అరగడం జరిగింది. ఇక ఇదే విషయాన్ని అస్సాం సీఎం అయిన హేమంత్ బిశ్వ శర్మ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఒకటే నినాదం ఒకటే పేరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఆయన పేర్కొనడం జరిగింది.
నిజానికి మ్యాచ్ లో ఇండియన్ టీమ్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి పాకిస్తాన్ ప్లేయర్లకు బుద్ధి చెప్పిందనే చెప్పాలి.మొన్న ఆ మధ్య పాకిస్థాన్ మాజీ ప్లేయర్,ప్రస్తుతం పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ గా ఉన్న ఇంజమామ్ ఉల్ హక్ కూడా ఇండియా వరల్డ్ కప్ లో సరిగ్గా అడదు మా టీమ్ చేతిలో ఓడిపోతుంది అంటూ చాలా వ్యాఖ్యలు చేశాడు.దానికి ఇప్పుడు మన ప్లేయర్లు బాగానే బుద్ది చెప్పారు…ఇలాంటి క్రమంలో ఇండియా టీం ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడిందంటే బౌలింగ్ లోను ,బ్యాటింగ్ లోను రాణిస్తూ వచ్చింది ఇక రోహిత్ శర్మ కూడా తనదైన మేటి ఆలోచనలతో కెప్టెన్ గా అత్యుత్తమమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించాడు.ఆయన అటు బ్యాట్స్ మెన్ గా కూడా రాణించాడు.
రోహిత్ రెండు రకాల పాత్రలను చాలా అద్భుతంగా పోషించాడు. కాబట్టి ఈ మ్యాచ్ ఇండియన్ టీమ్ సునాయాసం గా గెలిచింది. అలాగే ఇప్పుడు ఇండియన్ టీమ్ ఆడిన మూడు మ్యాచ్ లకి మూడు మ్యాచు గెలిచి ఆరు పాయింట్లతో ఇండియన్ టీమ్ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది…
Crowd of 100K+ Singing Jai Shree Ram at Narendra Modi Stadium#viratkohli #INDvsPAK pic.twitter.com/VOrotZBul9
— (@wrogn_edits) October 14, 2023