Rashi Phalalu: మహాలయ అమావాస్య తరువాత దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మరికొందరికి ప్రతికూల వాతావరనం ఉంటుంది. అక్టోబర్ 15 ఆదివారం 12 రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
తొందరపడి పెట్టుబడులు పెట్టొద్దు. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. భూమి లేదా ఆస్తికి సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుంది. ఎక్కవ శాతం శుభపరిణామమే.
వృషభం:
అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఇతరులతో ప్రేమగా మెలగాలి. భాగస్వామితో వాదనలు ఉంటాయి. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యను తోటి వారితో పరిష్కరించుకుంటారు.
మిథునం:
కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతరుల ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కొంత నష్టం కలిగే అవకాశం.
కర్కాటకం:
కొందరి సలహాలతో వ్యాపారంలో లాభాలు పొందుతారు. అయితే కొన్ని రంగాల వారికి కష్టాలు తప్పవు. పిల్లల భవిష్యత్ పై శుభవార్త వింటారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సత్తా చాటే సమయం ఇది.
సింహం:
వ్యాపారస్తులు ఇతరులతో వాగ్వాదం దిగాల్సి వస్తే మీదే విజయం అవుతుంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కన్య:
ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాల్లో ఫలితాలు పొందే అవకాశం. వ్యాపారులు రిస్క్ ల జోలికి వెళ్లకుండా ఉండాలి. అయితే కొందరు వ్యాపారులు అనుకోకుండా ఒప్పందాన్ని తీసుకుంటే భవిష్యత్ లో మంచి లాభాలు వస్తాయి.
తుల:
రుణాలను చెల్లిస్తారు. బహుమతులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉపాధి చేసేవారికి ఇది మంచిరోజు.
వృశ్చికం:
పిల్లల చదువుల కోసం ప్రయాణాలు చేస్తారు. పెట్టుబడులపై ప్రణాళికలు ఉండాలి. లేకుండే ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక శుభవార్త వింటారు. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి.
ధనస్సు:
బంధువుల నుంచి గౌరవ, మర్యాదలు పొందుతారు. కొత్త పనుల చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇల్లు లేదా దుకాణం కోసం కొంత డబ్బును ఖర్చు చేస్తారు.
మకరం:
ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం. జీవిత భాగస్వామితో వాదనలకు దిగొద్దు. ఓ రుణం విషయంలో ఇంట్లో గొడవలు ఉంటాయి. మనసులో కొత్త శక్తి వస్తుంది.
కుంభం:
వృత్తి, ఉద్యోగాల వారికి అనుకూల ఫలితాలు. మానసికంగా ధృఢంగా ఉంటారు. అధికార పరిధి పెరుగుతుంది.
మీనం:
బ్యాంకు లావాదేవీలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం. రాజకీయాల్లో ఉన్నవారికి శుభపరిణామం. స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.