Virat Kohli : దుబాయ్ లో జరిగిన హై ఓల్జేజీ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాక్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ ను సెంచరీతో గెలిపించాడు విరాట్ కోహ్లీ.. గత కొంత కాలంగా తన ఫామ్ మంచిగా లేదన్న వాళ్లకు ఈ సెంచరీతో సమాధానం చెప్పాడు విరాట్. 2025 ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో విరాట్ మరోసారి పాకిస్తాన్ పై తన విశ్వరూపం చూపించాడు. పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు.
కెరీర్లో 82వ సెంచరీ
భారతదేశం, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగా.. ఉత్సాహంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పరుగులు సాధించడం ఒకానొక దశలో సవాలుగా మారింది. పాకిస్తాన్ బౌలర్లు ప్రారంభంలో మంచి పట్టును కలిగి ఉన్నారు. భారత్ గెలవాలంటే మంచి స్కోరు కావాల్సి ఉంది. అలాంటి పరిస్థితిలో విరాట్ కోహ్లీ టీం ఇండియా బాధ్యత తీసుకుని సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సమయంలో తనను 7 ఫోర్లు కొట్టాడు.
16 ఏళ్ల నిరీక్షణకు తెర
విరాట్ కోహ్లీ తొలిసారిగా 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు. కానీ ఈ టోర్నమెంట్‌లో విరాట్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ సాధించడానికి అతను 16 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. 2023 ODI ప్రపంచ కప్ తర్వాత అతను వన్డేలో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఇది కాకుండా, తను 531 రోజుల తర్వాత విదేశీ గడ్డపై వన్డే సెంచరీ సాధించాడు.
ఈ జాబితాలో నంబర్ 1
ఐసిసి వన్డే ఈవెంట్‌లో విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌పై నాల్గవసారి 50+ పరుగులు చేశాడు. ఇది ఒక రికార్డు. అతను తప్ప, మరే ఇతర ఆటగాడు ఈ ఘనతను 3 సార్లు కంటే ఎక్కువ చేయలేకపోయాడు. విరాట్ కాకుండా, వివ్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్‌పై 3 సార్లు 50+ పరుగులు చేశారు. ఇది కాకుండా, ఐసీసీ వన్డే ఈవెంట్‌లో ఇది అతని 23వ 50+ స్కోరు. తను కాకుండా సచిన్ టెండూల్కర్ మాత్రమే ఐసిసి వన్డే ఈవెంట్లలో ఇన్నిసార్లు 50+ పరుగులు చేశారు.