IND vs NZ : విరాట్ కోహ్లీ ఔట్ కాదా? అంపైర్ తప్పిదం వల్లే అదంతా జరిగిందా? వైరల్ వీడియో

పూణే టెస్టులోనూ టీమిండియా ఓటమిపాలైంది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ 0-2 తేడాతో కోల్పోయింది. తొలిసారిగా న్యూజిలాండ్ జట్టు భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది.

Written By: NARESH, Updated On : October 26, 2024 10:16 pm

IND vs NZ: Was Virat Kohli out due to umpire's mistake? Viral video

Follow us on

IND vs NZ : పుష్కరకాలం నుంచి టీమిండియా స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోలేదు. గొప్ప గొప్ప జట్లను సైతం ఓడించి రికార్డును పదిలంగా కాపాడుకుంటున్నది. అలాంటి జట్టు అనామకమైన న్యూజిలాండ్ స్థితిలో ఓడిపోవడాన్ని సగటు భారత క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. పూణే మైదానంలో జరిగిన రెండవ టెస్టులో అంపైర్ తప్పిదం విరాట్ కోహ్లీ అవుట్ కు కారణమైందని నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లీ ఫీల్డ్ ఎంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది. అంపైర్ తప్పిదం వల్లే తను అవుట్ అయ్యాననే కోపంతో విరాట్ మైదానాన్ని వీడాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. శనివారం మూడో రోజు ఆటలో టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. తొలి ఇన్నింగ్స్ లో దారుణమైన షాట్ ఆడబోయి విరాట్ కోహ్లీ సాంట్నర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో విరాట్ స్థిరంగా ఆడడానికి ప్రయత్నించాడు. 40 బంతులు ఎదుర్కొన్న అతడు రెండు ఫోర్ల సహాయంతో 17 పరుగులు చేశాడు. దీంతో అతడు క్రీజ్ లో పాతుకుపోయినట్టేనని అభిమానులు అనుకున్నారు. అయితే మరోసారి అతడిని సాంట్నర్ క్రికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు. ఫలితంగా నిరాశతో విరాట్ మైదానాన్ని విడాడు.

విరాట్ ఆగ్రహం

సాంట్నర్ వేసిన 29 ఓవర్ చివరి బంతిని కోహ్లీ డిఫెన్స్ ఆడాలని భావించాడు. కానీ ఆ బంతి మిస్ అయింది. విరాట్ ప్యాడ్స్ ను తాకింది. దీంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు బిగ్గరగా అరిచారు. వెంటనే ఫీల్డ్ ఎంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ అవుట్ అంటూ సంకేతాన్ని చూపించాడు. దీంతో కోహ్లీ రివ్యూ కోరాడు. బంతి లెగ్ స్టంప్ ను తగలడం లేదని విశ్వాసంతోనే అతడు రివ్యూ కి వెళ్ళాడు. అయితే బంతి లెగ్ స్టంప్ ను తాకుతున్నట్టు కాస్త కనిపించింది. దీంతో థర్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వడంతో కోహ్లీ నిరాశగా మైదానాన్ని వీడాడు. అంతేకాదు క్రీజ్ లో నుంచి బయటికి వెళ్తున్న సమయంలో అంపైర్ వైపు కోపంగా చూశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరోవైపు విరాట అభిమానులు అంపైర్ రిచర్డ్ పై రుస రుసలాడుతున్నారు. 2019లో ఇల్లింగ్ భారత జట్టుకు వ్యతిరేకంగా వ్యవహరించాడని.. 2019 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో అతడు మన జట్టుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. విరాట్ అవుట్ అయిన వెంటనే భారత జట్టు లోని మిగతా ఆటగాళ్లు త్వర త్వరగా పెవిలియన్ చేరుకున్నారు.