https://oktelugu.com/

IND vs NZ : అతడు వస్తే టీమిండియా వెలిగిపోతుందన్నారు. కేజీఎఫ్ లెవెల్ లో ఎలివేషన్లు ఇచ్చారు.. చివరికి జట్టును ఇలా చేశాడు..

ఐపీఎల్ 2024 సీజన్లో కోల్ కతా జట్టుకు మెంటార్ గా ఉన్నాడని.. ఆ జట్టును విజేతగా నిలపడంలో గౌతమ్ గంభీర్ తీవ్రంగా కృషి చేశాడని.. గుర్తించి అతడిని టీమిండియా కోచ్ గా బీసీసీఐ నియమించింది. కళ్ళు చెదిరే జీతభత్యాలు అందిస్తోంది. కానీ అతడేమో జట్టుకు తీవ్రమైన పరాభవాలను మిగుల్చుతున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 26, 2024 10:36 pm

    IND vs NZ

    Follow us on

    IND vs NZ : టీమిండియా కోచ్ గా నియమితుడైన తర్వాత గౌతమ్ గంభీర్ కు కేజీ ఎఫ్ లెవెల్ లో ఎలివేషన్ ఇచ్చారు. అతడు టీమిండియా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తాడని వ్యాఖ్యానించారు. కానీ వాస్తవంలో జరుగుతోంది వేరు. న్యూజిలాండ్ చేతిలో టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. దీంతో 12 సంవత్సరాల తర్వాత టీమిండియా స్వదేశంలో టెస్ట్ సిరీస్ ను నష్టపోయింది. వాస్తవానికి టీమ్ ఇండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకమైన తర్వాత దారుణమైన వైఫల్యాలను ఎదుర్కొంటున్నది. న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో కోల్పోయింది.. వాస్తవానికి 2024 t20 ప్రపంచ కప్ ను భారత జట్టు గెలిచిన తర్వాత రాహుల్ ద్రావిడ్ పదవి కాలం పూర్తయింది. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ కు అవకాశమిచ్చారు. అయితే తక్కువ కాలంలోనే గౌతమ్ గంభీర్ భారత జట్టుకు దారుణమైన వైఫల్యాలను మిగిల్చాడు. గౌతమ్ గంభీర్ కోచ్ గా నియామకమైన తర్వాత టీమ్ ఇండియా శ్రీలంకలో పర్యటించింది. టి20 సిరీస్ దక్కించుకుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ లో ఓటమిపాలైంది. 27 సంవత్సరాల తర్వాత శ్రీలంక పై టీమ్ ఇండియా వన్డే సిరీస్ కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన 3 వన్డే మ్యాచ్ లలో భారత్ దారుణంగా ఓడిపోయింది. ఈ సిరీస్ లో ఆడిన అన్ని మ్యాచ్లలో భారత జట్టు ఆల్ అవుట్ కావడం విశేషం. ఇక టీమిండియా ఏడాది వ్యవధిలో వన్డేలను గెలవకపోవడం 45 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. 2024 లో టీమిండియా కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడింది. అందులో రెండు ఓడిపోయింది. ఒకదానిని టై గా ముగించింది.

    1988 తర్వాత గెలిచింది.. సిరీస్ నూ సొంతం చేసుకుంది..

    ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా దారుణమైన ఆటతీరు కొనసాగించింది బెంగళూరు టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పూణే టెస్ట్ లోను దారుణమైన వైఫల్యాన్ని చవిచూసింది. 36 సంవత్సరాల తర్వాత స్వదేశంలో భారత జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించింది. 1988లో న్యూజిలాండ్ చివరిసారిగా భారత జట్టుపై టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత జట్టు 19 సంవత్సరాల తర్వాత ఓటమిపాలైంది. 2005లో ఈ మైదానంపై జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ ను పాకిస్తాన్ చెట్టు గురించి. ఇక బెంగళూరు టెస్ట్ లోనే టీమ్ ఇండియా 46 పరుగులకు కుప్పకూలింది. స్వదేశంలో 50 పరుగుల లోపే ఆల్ అవుట్ కావడం టీమిండియా క్రికెట్ చరిత్రలో ఇది మొదటిసారి. ఇక పూణే టెస్టులో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో.. సిరీస్ కూడా కోల్పోయింది. పుష్కరకాలం తర్వాత సొంత దేశంలో భారత్ టెస్ట్ సిరీస్ ను పర్యాటక జట్టుకు అప్పగించింది. ఈ టెస్ట్ సిరీస్ కంటే ముందు టీమిండియా వరుసగా 18 టెస్ట్ సిరీస్ విజయాలను సాధించింది. అయితే ఈ విజయ యాత్రకు న్యూజిలాండ్ బ్రేక్ వేసింది. 4335 రోజుల అనంతరం భారత్ సొంత దేశంలో టెస్ట్ సిరీస్ నష్టపోయింది.