Homeక్రీడలుIND vs NZ : అక్షర్ పటేల్ పాదాలను తాకిన క్రికెట్ దిగ్గజం విరాట్.. వీడియో...

IND vs NZ : అక్షర్ పటేల్ పాదాలను తాకిన క్రికెట్ దిగ్గజం విరాట్.. వీడియో వైరల్

IND vs NZ : ఛాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ ను 44 పరుగుల తేడాతో ఓడించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు 205 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే కేన్ విలియమ్సన్ తన జట్టు విజయం కోసం గట్టిగా నిలబడ్డాడు. కానీ అక్షర్ పటేల్ తన స్పెల్ చివరి బంతికి కేన్ విలియమ్సన్‌ను అవుట్ చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్‌ను వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ స్టంపౌట్ చేశాడు. కేన్ విలియమ్సన్ 81 పరుగులు చేసి న్యూజిలాండ్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.


అక్షర్ పటేల్ కేన్ విలియమ్సన్‌ను అవుట్ చేసిన తర్వాత స్టేడియంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. క్రికెట్ దేవుడు విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ పాదాలను తాకాడు. అక్షర్ పటేల్ వికెట్ తీసుకున్నందుకు విరాట్ కోహ్లీ ఈ విధంగా తనను అభినందించాడు. విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కామెంట్లతో వారిద్దరినీ అభినందిస్తున్నారు.

Also Read : తొలి ఓవర్ లో 8 పరుగులు ఇచ్చాడు.. ఆ తర్వాతే చుక్కలు చూపించాడు.. అదీ వరుణ్ చక్రవర్తి అంటే..

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. భారత్ తరఫున శ్రేయాస్ అయ్యర్ అత్యధికంగా 79 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 45 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 42 పరుగులు సాధించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు 44 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. భారతదేశం తరపున స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి 10 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి ఐదుగురిని అవుట్ చేశాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు.

Also Read : భారత్ ను ఊరిస్తున్న మొదటి స్థానం.. కివీస్ ను ఎలా పడగొడుతుందో?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular