IND vs NZ : ముంబై పిచ్ బీసీసీఐ మార్చేసింది.. వివాదంపై స్పందించిన ఐసీసీ

ఇక ఇలాంటి క్రమం లో మరోసారి చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా బిసిసిఐ ని విమర్శించడం మానేస్తే మంచిది అని చాలా మంది ఇండియన్ సీనియర్ ప్లేయర్లు సైతం అభిప్రాయ పడుతున్నారు...

Written By: NARESH, Updated On : November 15, 2023 11:29 pm
Follow us on

IND vs NZ : వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో చివరి క్షణంలో పిచ్ మార్చడం తో బిసిసిఐ పైన సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. బీసీసీఐ కావాలనే ఇలా పిచ్ ని చివరి నిమిషంలో మార్చింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బిసిసిఐ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. ఇక దీనికి ఐసిసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.నిజానికి సెమీ ఫైనల్ మ్యాచ్ కొత్త పిచ్ పైన ఆడాల్సింది కానీ కొన్ని ఇబ్బందుల వల్ల అలా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇంతకుముందు కూడా చాలాసార్లు చాలా మ్యాచ్ ల్లో చివరి నిమిషం లో పిచ్ మార్చిన మ్యాచ్ లు చాలా చూశాం. పరిస్థితులు మనకు అనుకూలించని సందర్భంలో పిచ్ లు అనేవి మారుతూ ఉంటాయి. దానివల్ల ఎవరో కావాలని పిచ్ లు మార్చడం లాంటివి ఏమీ ఉండవు కాబట్టి దాన్ని పర్సనల్ గా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అంటూ ఐసిసి స్పందించడం జరిగింది.

ఇక ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మ్యాచ్ లు ఆడిన పిచ్ పైనే ఈ మ్యాచ్ ఆడించడం అనేది బిసిసిఐ పన్నిన కుట్రగా చాలామంది అభివర్ణిస్తున్నారు…ఇక మరి కొంతమంది మాత్రం ఇలాంటి విషయాలలో పక్షపాతం చూపించాల్సిన అవసరం బిసిసిఐ కి లేదు ఎందుకంటే ఇండియన్ టీం ప్రస్తుతం ఏ పిచ్ మీదైనా చాలా అద్భుతంగా ఆడుతుంది. అలాగే ఇప్పుడు ఆడేది కూడా ఇండియాలోనే కాబట్టి ప్రతి పిచ్ లో ఇండియన్ ప్లేయర్లకు మంచి అనుభవం ఉంది. ఇక ఇలాంటి క్రమంలో బీసీసీఐ అలా వ్యవహరించాల్సిన అవసరం లేదంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు…

ఇక ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ మొదట బ్యాటింగ్ తీసుకొని 397 భారీ పరుగులు చేసింది. ఇండియన్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ , శ్రేయస్ అయ్యర్ ఇద్దరు సెంచరీలు చేయడంతో ఇండియన్ టీమ్ భారీ స్కోరు చేయగలిగింది. ఇక భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీం కి మొదట్లో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ అయిన విలియం సన్, డారియాల్ మిచెల్ ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆడారు…

ఇక ఈరోజు పిచ్ బ్యాటింగ్ కి ఎక్కువగా అనుకూలించింది. అందుకే రెండు టీములు కూడా భారీ పరుగులు చేయగలిగాయి…ఇక ఇలాంటి క్రమం లో మరోసారి చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా బిసిసిఐ ని విమర్శించడం మానేస్తే మంచిది అని చాలా మంది ఇండియన్ సీనియర్ ప్లేయర్లు సైతం అభిప్రాయ పడుతున్నారు…