Virat Kohli: కోహ్లి 50 సెంచరీలలో ఏ దేశం మీద ఎన్ని చేశాడు అంటే..?

ఇండియన్ టీం లో కోహ్లీ ఉండడం ఇండియన్ టీమ్ చేసుకున్న అదృష్టం...మన శత్రుదేశం అయిన పాకిస్తాన్ లాంటి దేశం కూడా మాకు కాశ్మీర్ వద్దు కోహ్లీ ని ఇవ్వండి చాలు అని బీసీసీఐ ని రిక్వెస్ట్ చేశారు .

Written By: Gopi, Updated On : November 16, 2023 8:20 am

Virat Kohli

Follow us on

Virat Kohli: ఇండియన్ క్రికెట్ టీమ్ లో విరాట్ కోహ్లీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి క్రికెట్ ఆడుతున్నాడు అంటే సాధ్యమైనంతవరకు పరుగులు చేయడానికి మాత్రమే క్రికెట్ ఆడుతాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేస్తూ ప్రపంచ క్రికెట్ చరిత్రలో క్రికెట్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు అంటే ఆవ్యక్తి కి క్రికెట్ అంటే పిచ్చి ప్రాణం అనే చెప్పాలి.అలాంటి ఒక వ్యక్తే కింగ్ కోహ్లీ…

ఇండియన్ టీం లో కోహ్లీ ఉండడం ఇండియన్ టీమ్ చేసుకున్న అదృష్టం…మన శత్రుదేశం అయిన పాకిస్తాన్ లాంటి దేశం కూడా మాకు కాశ్మీర్ వద్దు కోహ్లీ ని ఇవ్వండి చాలు అని బీసీసీఐ ని రిక్వెస్ట్ చేశారు అంటేనే మనం అర్థం చేసుకోవాలి కోహ్లీ కి ఉన్న టాలెంట్ ఏంటో… అలాగే ఇక న్యూజిలాండ్ ఇండియా మధ్య జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ తన 50వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు వన్డేల్లో 49 సెంచరీలను చేసి సచిన్ తో సమానం అయిన కోహ్లీ తన 50వ సంచరీ ని పూర్తిచేసుకొని సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.

ఇక అలాగే ఒక వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కూడా కోహ్లీ రికార్డు లోకి ఎక్కాడు. ఇది కూడా సచిన్ పేరు మీద ఉన్న రికార్డ్ కావడం విశేషం…ఇక 2003 వ సంవత్సరంలో 11 మ్యాచుల్లో సచిన్ 673 పరుగులు చేశాడు.ఇక ఇప్పటివరకు ప్రపంచంలో అదే హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ఇక ప్రస్తుతం కోహ్లీ మాత్రం 10 ఇన్నింగ్స్ లల్లోనే 711 పరుగులు చేసి సచిన్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు.అందుకే కోహ్లీ ని ద కింగ్ కోహ్లీ అంటారు.ఇక తన ఫ్యాన్స్ ముద్దుగా రన్ మిషన్ అని కూడా పీల్చుకుంటారు. ఇక కోహ్లీ ఇంతటి ఘన విజయం వెనకాల చాలా కష్టం ఉంది. అందుకే కోహ్లీ అన్నిటినీ చాలా క్యాలిక్యులేట్ చేస్తూ టీం విజయం లో చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక మన ప్రత్యర్థి బౌలర్ మన పైన ఎలాంటి అస్త్రాలను సంధిస్తున్నాడు, మనం వాటిని ఎలా తిప్పి కొట్టాలి. అనే వాటిని చాలా క్షుణ్ణంగా చదివిన వ్యక్తి విరాట్ కోహ్లీ… అందుకే ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు…

ఇక ఇప్పటి వరకు కోహ్లీ చేసిన 50 సెంచరీలలో శ్రీలంక మీద 10 సెంచరీలు చేశాడు, అలాగే వెస్టిండీస్ మీద 9 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా మీద 8, బంగ్లాదేశ్ మీద 5, న్యూజిలాండ్ మీద 6, సౌతాఫ్రికా మీద 5 సెంచరీలు చేశాడు, ఇంగ్లాండ్ మీద 3 సెంచరీలు, పాకిస్తాన్ టీమ్ మీద 3 సెంచరీ నమోదు చేసుకున్నాడు. అలాగే జింబాబ్వే టీమ్ మీద ఒక సెంచరీ నమోదు చేశాడు. ఇలా ప్రతి టీమ్ మీద కూడా తన సత్తా చూపిస్తూ ప్రత్యర్థి దేశాలన్నింటికీ చెమటలు పట్టించాడు…ఒక ఇండియన్ టీమ్ సెమీస్ లో గెలవడానికి కింగ్ కోహ్లీ ఒక అద్భుతమైన నాక్ అయితే ఆడాడు…