spot_img
Homeక్రీడలుIND vs NZ : ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి.. కివీస్ ను ఓడించాయి.. వరల్డ్...

IND vs NZ : ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి.. కివీస్ ను ఓడించాయి.. వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా

IND vs NZ :  ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి.. ఆ మంటల్లో న్యూజిలాండ్ కాలిపోయింది.. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో అప్పుడు అజేయంగా సెమీస్ చేరిన టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ పై ఇప్పుడు ప్రతీకారం పూర్తయ్యింది. నాడు ఏడ్చిన రోహిత్, విరాట్ కోహ్లీలు ఇప్పుడు నవ్వేశారు.వాళ్లే దంచి కొట్టి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. షమీ నిప్పులు చెరిగే బంతులతో కివీస్ పై 7 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్ పై విజయం చిరస్మరణీయం.. టీమిండియా ఈ విజయంతో వరల్డ్ కప్ ఫైనల్ చేరింది.

ఒక మ్యాచ్ గెలవాలంటే ఎంతటి క్లిష్ట పరిస్థితిని అయినా సరే ఎదిరించి నిలబడగలిగే దైర్యం ఉండాలి.ప్రతి సిచువేషన్ ని మనకు అనుకూలంగా మార్చుకునే తెగింపు ఉండాలి. పడిపోయిన సరే మళ్లీ లేవగలం అనే ధైర్యం ఉండాలి అంత క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన గెలుపును మనం పూర్తిగా నమ్మినప్పుడు ఎప్పుడు చూడని కళ్ళు మనల్ని గర్వంగా చూడడం మొదలు పెడతాయి అప్పుడే మన విజయం మనకు చాలా గొప్పగా కనిపిస్తుంది. శత్రువు కండ్ల ల్లో భయం కనిపించినప్పుడే మనం నిజంగా గెలిచినట్టు ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి ప్లేయర్లు కండ్ల ల్లో మొదటి నుంచి మనకు కనిపించింది అదే…ఇక ఒక్క అడుగు దూరం లో వరల్డ్ కప్ దాగి ఉంది ఇన్ని అడుగులు బలంగా వేసిన వాళ్ళకి ఒక అడుగు వేయడం పెద్ద కష్టం కాదు ఫైనల్ కూడా గెలిచి గెలుపును గర్వం గా ప్రపంచానికి చాటాలి…

ఇక న్యూజిలాండ్ మీద ఇండియన్ టీం ఘన విజయం సాధించి 2019 జులై 9వ తేదీన మన్ టీం కి న్యూజిలాండ్ చేతిలో ఎలాంటి పరాభవమైతే ఎదురైందో దానికి రెట్టింపు పరాభవం ఇప్పుడు ఇండియా చేతిలో న్యూజిలాండ్ కి ఎదురయింది. ఇండియన్ టీమ్ గెలుపు ఎంత బహాయం కారంగా ఉంటుందో న్యూజిలాండ్ టీం కి తెలిసేలా చేశారు.ఇక ఈ మ్యాచ్ లో కీలక పాత్ర వహించిన శ్రేయస్ అయ్యారు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో వాళ్ల వంతు కృషి వాళ్ళు చేశారు. ఇక బౌలింగ్ లో మహమ్మద్ షమీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒకే ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసి ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డుని తన పేరుమీద నమోదు చేసుకున్నాడు. ఇక ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో ఇండియన్ టీం లో కూడా ఏడు వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్ గా తన పేరుని వరల్డ్ కప్ హిస్టరీ లో సువర్ణాక్షరాలతో లిఖించూకున్నాడు.

ఒక టైంలో ఇండియా మ్యాచ్ ఓడిపోతుందేమో అనేంత క్రిటికల్ సిచువేషన్ క్రియేట్ అయింది.అయిన కూడా మన ప్లేయర్లు ఎక్కడ తగ్గలేదు వెనక్కిపడిన అడుగు మళ్లీ ముందుకు వేయడం ఎంతసేపు అన్నంత రేంజ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా తమ హాట్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడుతూ బ్యాటింగ్ లో గాని బౌలింగ్ లో గాని వాళ్ల బెస్ట్ ఇస్తు చివరి బ్లెడ్ వరకు పోరడుతాం అంటూ ప్రయత్నం చేసి ఇండియాని సెమీఫైనల్ లో గెలిపించి ఫైనల్ లో నిలిపారు. ఇక ఒక్క అడుగు దూరంలో ఇండియాకి వరల్డ్ కప్ అనేది దాగి ఉంది 10 అడుగులు వేసినవాడికి ఆ ఒక్క అడుగుని అధిగమించడం పెద్ద కష్టమైతే కాదు…ఇక ఇండియా ఈ గెలుపు తో వరుస ఈ వరల్డ్ కప్ లో 10 వ విజయాన్ని అందుకుంది…ఇక ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీసి మన టీమ్ విజయం లో కీలక పాత్ర వహించిన షమీ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది….2019 లో ఇండియన్ జనాలు అందరూ పెట్టుకున్న కన్నీళ్లు ఇప్పుడు అగ్ని రూపం లో న్యూజిలాండ్ టీమ్ ని దహించి వేసింది….

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper
Exit mobile version