Ind Vs Nz Final 2025: సెమీ ఫైనల్ మ్యాచ్ లలో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించాయి. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించాయి. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ – న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. ఐసీసీ నిర్వహించిన ఫైనల్ టోర్నీలలో భారత్ – న్యూజిలాండ్ రెండుసార్లు తలపడగా.. రెండుసార్లు కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది. 2000 సంవత్సరంలో కెన్యా వేదికగా నిర్వహించిన నాకౌట్ టోర్నీలో న్యూజిలాండ్ సంచలన విజయం సాధించింది. నాడు టీమిండియా కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ ఉన్నారు. ఆ మ్యాచ్లో అతడు సెంచరీ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. న్యూజిలాండ్ ఆటగాడు క్రిస్ క్రేయిన్స్ సెంచరీ చేసి జట్టను గెలిపించాడు. క్రిస్ హారీస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 2021 సంవత్సరంలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ భారత్ పై విజయం సాధించింది. రెండుసార్లు ఐసీసీ టోర్నీలలో భారత్ ఫైనల్ మ్యాచ్లలో ఓడిపోయింది.
Also Read: CT రద్దయితే ఐసిసి ఏం చేస్తుంది? ఛాంపియన్ ను ఎలా నిర్దేశిస్తుంది?
మ్యాచ్ కు సిద్ధం
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కు మైదానం సిద్ధమైంది. కొద్దిరోజులుగా ఈ మైదానాన్ని పిచ్ క్యూరేటర్లు సిద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ – భారత్ తలపడిన మైదానాన్నే ఫైనల్ మ్యాచ్ కు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ 244 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని భారత్ సులువుగా ఛేదించింది. దుబాయ్ మైదానంపై కొత్త పిచ్ ల పై భారత్ ఆడింది. ఫైనల్ మ్యాచ్ కూడా కొత్త పిచ్ పైనే ఆడుతుంది. దుబాయ్ లో ఆడటం భారత జట్టుకు కలిసి వస్తుందని ఇటీవల కొంతమంది ఇతర దేశాల మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించగా.. దానిని టీం ఇండియా మాజీ క్రికెటర్లు ఖండించారు. దుబాయ్ భారత జట్టుకు సొంతమైదానం కాదని.. ఆ మైదానంపై గెలవడం అంత ఈజీ కాదని పేర్కొన్నారు. గణాంకాలతో సహా వివరించారు. అడ్వాంటేజ్ అని చెప్పేవారు.. మిగతా మైదానాలపై ఎందుకు వరుస విజయాలు సాధించలేకపోతున్నారని విమర్శించారు. పాకిస్తాన్ జట్టుకు దుబాయ్ రెండవ హోం గ్రౌండ్ లాంటిదని.. అలాంటి జట్టు దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లలో ఎందుకు విజయం సాధించలేదని విమర్శిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలవడం కీలకంగా మారుతుందని క్యూరేటర్లు అంటున్నారు. మరి దుబాయ్ మైదానంపై వేసే టాస్ ను రోహిత్ గెలుస్తాడా? లేదా? అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ రోహిత్ గనుక టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.