https://oktelugu.com/

Ind vs Nz 3rd Test 2024: గెలుపు ముంగిట భారత్ తడ “బ్యాటు”.. వాంఖడే లో ఏం జరుగుతోందంటే?

ముంబై మైదానం గింగిరాలు తిరుగుతోంది. మూడో రోజు కూడా బంతి విపరీతంగా స్పిన్ అవుతోంది. ఆదివారం కూడా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.. ముఖ్యంగా భారత ఆటగాళ్లు న్యూజిలాండ్ స్పిన్ ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 3, 2024 / 11:03 AM IST

    Ind vs Nz 3rd Test 2024(2)

    Follow us on

    Ind vs Nz 3rd Test 2024: ముంబై వేదికగా జరుగుతున్న మూడవ టెస్టులో భారత్ విజయం దిశగా ప్రయాణం సాగిస్తోంది. ఈ వేదికపై టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులు చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 263 రన్స్ చేసింది. తద్వారా 28 పరుగుల లీడ్ సంపాదించింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ జట్టు 174 పరుగులకు కుప్పకూలింది. దీంతో టీమిండియా ఎదుట 154 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.. దీనిని ఛేదించ క్రమంలో టీమిండియా తడబడుతోంది. స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కడపటి వార్తలు అందే సమయానికి టీమిండియా 29 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్ (5), రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (1), సర్ఫరాజ్ ఖాన్ (1), గిల్(1) వెంటవెంటనే అవుట్ అయ్యారు. అజాజ్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఫిలిప్స్, హెన్రీ చెరో వికెట్ దక్కించుకున్నారు.

    బంతి గింగిరాలు

    ముంబై మైదానం గింగిరాలు తిరుగుతోంది. మూడో రోజు కూడా బంతి విపరీతంగా స్పిన్ అవుతోంది. ఆదివారం కూడా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.. ముఖ్యంగా భారత ఆటగాళ్లు న్యూజిలాండ్ స్పిన్ ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఈ మైదానంపై అత్యధిక చేదన రికార్డు దక్షిణాఫ్రికా మీద ఉంది. 2000 సంవత్సరం ఫిబ్రవరిలో భారత్ సౌత్ ఆఫ్రికా ఎదుట 163 రన్ టార్గెట్ విధించగా.. సౌత్ ఆఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేదించింది. 1980లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎదుట భారత్ 96 రన్స్ టార్గెట్ విధించింది. దానిని ఇంగ్లాండ్ ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. 2012 నవంబర్లో ఇదే వేదికపై ఇంగ్లాండు జట్టు భారత్ పై పదవి కట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ 58 పరుగుల టార్గెట్ విధించగా.. ఇంగ్లాండ్ ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఆ రన్స్ టార్గెట్ ను చేదించింది. 1984లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు విధించిన 48 పరుగుల లక్ష్యాన్ని భారత రెండు వికెట్లు కోల్పోయి చేదించింది. ఇక 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టీమిండియా 47 రన్స్ టార్గెట్ విధించగా.. ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సాధించింది. అయితే ఈ మైదానం ప్రారంభం నుంచి స్పిన్ వికెట్ గా ఉంది. బంతి అనూహ్యంగా టర్న్ అవుతుంది. బ్యాటర్లు కుదురుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందువల్లే ఈ మైదానంపై బ్యాటింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇంతవరకు ఈ మైదానంపై 160+ కు మించి టార్గెట్ విధించలేదంటే మైదానం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో.. విజయం పై ఒకింత సందిగ్ధం నెలకొంది. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 106 రన్స్ చేయాల్సి ఉంది.