Ind Vs Nz 1st Test: 99 వద్ద బౌల్డ్.. అందరి గుండెలను పిండేసిన పంత్ ఔట్.. స్టేడియం అంతా కన్నీళ్లే

సరిగ్గా ఏడాది క్రితం సమయానికి రిషబ్ పంత్ మంచానికి పరిమితమయ్యాడు. కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. అలాంటి ఆ యువకుడు గోడకు కొట్టిన బంతిలాగా లేచాడు. చావు చివరి అంచుదాకా వెళ్లి వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతడు.. ఫీనిక్స్ పక్షి లాగా కొత్త రూపును సంతరించుకున్నాడు .

Written By: Anabothula Bhaskar, Updated On : October 19, 2024 5:25 pm

Ind Vs Nz 1st Test(3)

Follow us on

Ind Vs Nz 1st Test: ఐపీఎల్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన పంత్.. అదే ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతాలను సృష్టిస్తున్నాడు. అందువల్లే అతడిని నయా మహేంద్ర సింగ్ ధోని అని పిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో.. పంత్ తన విశ్వరూపం చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకు కుప్పకూలిన నేపథ్యంలో.. రెండవ ఇన్నింగ్స్ లో భారత్ సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నది. యశస్వి జైస్వాల్ నుంచి మొదలు పెడితే పంత్ వరకు అదిరిపోయే బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా సర్పరాజ్ ఖాన్ 150 పరుగులు చేసి వారెవా అనిపించాడు. పంత్ మాత్రం ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా నిర్వేదం అలముకుంది. బరువెక్కిన గుండెతో రిషబ్ పంత్ మైదానాన్ని వీడి వస్తుంటే.. మైదానంలో ఉన్న ప్రేక్షకులు కంటతడి పెట్టారు. అతడి అభిమానులు గుండె పగిలిపోయిందని వ్యాఖ్యానించారు.. సర్ఫ రాజ్ – రిషబ్ పంత్ నాలుగో వికెట్ కు ఏకంగా 144 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో సర్ఫరాజ్ 150 పరుగులు చేయగా.. రిషబ్ పంత్ 99 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

బంతి గమనాన్ని తప్పుగా అంచనా వేసి

విలియం ఓరూర్కే వేసిన 88.1 ఓవర్ లో పంత్ భారీ షాట్ ఆడి.. సెంచరీ చేయాలని భావించాడు. అయితే అతడు బంతి గమనాన్ని తప్పుగా అంచనా వేయడంతో.. అది వికెట్లను గిరాటేసింది. దీంతో పంత్ నిరాశగా మైదానాన్ని వీడాడు. పంత్ 105 బంతుల్లో 9 ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 99 పరుగులు చేశాడు.. సర్ఫరాజ్ ఖాన్ తో కలసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 177 పరుగులు జోడించడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే పంత్ ఔటయిన తర్వాత కేఎల్ రాహు ల్(12), రవీంద్ర జడేజా (5) వెంట వెంటనే వెను తిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్ లో రవిచంద్రన్ అశ్విన్ (5), కులదీప్ యాదవ్ (0) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 88 పరుగుల లీడ్ లో ఉంది. మైదానం తేమగా ఉండడంతో బౌలర్లు పేస్, బౌన్స్ సంధిస్తున్నారు. దీంతో బ్యాటర్లు బ్యాటింగ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అదే విధంగా అవుట్ అయ్యారు. దీంతో భారత్ కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నది.