IND vs ENG: రెండు జట్లకు షాకులు

ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టులో ఓడిద్దామనుకున్న భారత జట్టుకు వరుణుడు విలన్ లా వచ్చి చివరి రోజు అడ్డుకున్నాడు. సమరోత్సాహంతో ఉన్న భారత జట్టు ఆశలపై ‘నీళ్లు’ చల్లాడు.. అయితే తొలి టెస్టు తర్వాత ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు రెండు జట్లకు గట్టి షాకులు తగిలాయి.. రెండో టెస్టుకు ముందు భారత్, ఇంగ్లండ్ జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. టీమిండియా యువ ఆల్ రౌండర్ శార్ధుల్ ఠాకూర్, ఇంగ్లండ్ ప్రధానపేసర్ స్టువర్ట్ […]

Written By: NARESH, Updated On : August 11, 2021 12:01 pm
Follow us on

ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టులో ఓడిద్దామనుకున్న భారత జట్టుకు వరుణుడు విలన్ లా వచ్చి చివరి రోజు అడ్డుకున్నాడు. సమరోత్సాహంతో ఉన్న భారత జట్టు ఆశలపై ‘నీళ్లు’ చల్లాడు.. అయితే తొలి టెస్టు తర్వాత ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు రెండు జట్లకు గట్టి షాకులు తగిలాయి..

రెండో టెస్టుకు ముందు భారత్, ఇంగ్లండ్ జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. టీమిండియా యువ ఆల్ రౌండర్ శార్ధుల్ ఠాకూర్, ఇంగ్లండ్ ప్రధానపేసర్ స్టువర్ట్ బ్రాడ్ గాయపడ్డారు. వీరిద్దరూ లార్డ్స్ టెస్టు ఆడడం కష్టమేనని టీంలు తెలిపాయి. ఇక బ్రాడ్ కు బదులుగా మార్క్ వుడ్, శార్ధూల్ స్థానాన్ని ఇషాంత్ శర్మ భర్తీ చేస్తారని తెలుస్తోంది.

శార్ధుల్ ఠాకూర్ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నట్టు తెలిసింది. మంగళవారం ప్రాక్టీస్ లో అతడి కండరాలు పట్టేసినట్టు తెలుస్తోంది. గాయం తీవ్రతపై సమాచారం లేదని.. అతడు ఆడకుంటే సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పునరాగమనం చేస్తాడని చెబుతున్నారు.

తొలి టెస్టులో అశ్విన్ ను కాదని శార్ధుల్ ను తీసుకున్నారు. పేస్ బౌలింగ్ తోపాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండడంతో అతడికి అవకాశం ఇచ్చారు. ఇంగ్లండ్ లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ తో ఆడుతామని కెప్టెన్ కోహ్లీ తెలుపడంతో అశ్విన్ కు చోటు దక్కడం కష్టమేనంటున్నారు.

ఇక ప్రాక్టీస్ సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ కాలి మడమకు గాయమైందని.. గాయం తీవ్రంగానే ఉందని ఇంగ్లండ్ టీం తెలిపింది. అతడు లేచి నిలబడే పరిస్థితి లేదని తెలిపింది. పూర్తి సిరీస్ కు బ్రాడ్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.