హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ‘గెల్లు’

హుజూరాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ఫోకస్ చేసింది. అభ్యర్థిని ప్రకటించేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. అన్ని సమీకరణాలు ఆలోచించాక పార్టీ అభ్యర్థి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దాదాపు గెల్లు పేరును కేసీఆర్ ఖాయం చేశారని తెలుస్తోంది. నేడు అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. కేసీఆర్ అధ్యక్షగన జరుగున్న సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈరోజు మంచిరోజు కావడంతో […]

Written By: NARESH, Updated On : August 11, 2021 2:12 pm
Follow us on

హుజూరాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ఫోకస్ చేసింది. అభ్యర్థిని ప్రకటించేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. అన్ని సమీకరణాలు ఆలోచించాక పార్టీ అభ్యర్థి పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

టీఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దాదాపు గెల్లు పేరును కేసీఆర్ ఖాయం చేశారని తెలుస్తోంది. నేడు అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

కేసీఆర్ అధ్యక్షగన జరుగున్న సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈరోజు మంచిరోజు కావడంతో సమావేశం ముగిశాక అభ్యర్థిని ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది. ఈటల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లను పరిశీలించింది.

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి రేసులో గెల్లు శ్రీనివాస యాదవ్, స్వర్గం రవి, వీరేశం, వకుళాభరణం కృష్ణమోహన్ తోపాటు పాడి కౌశిక్ రెడ్డి పేరు కూడా వినిపించింది. అయితే కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు కేసీఆర్. ఈ క్రమంలోనే ఉద్యమ నాయకుడు అయిన గెల్లు శ్రీనివాస యాదవ్ వైపే సీఎం మొగ్గు చూపినట్లు సమాచారం.

వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన గెల్లు శ్రీనివాస్.. బీసీ నేతగా.. విద్యార్థి నేతగా.. తెలంగాణ ఉద్యమకారుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. బీసీ నేతగా ఈటల రాజేందర్ ప్రజల్లోకి వెళ్తుండడంతో ఆయనకు చెక్ పెట్టేందుకు బీసీ నేత గెల్లును ప్రయోగించాలని టీఆర్ఎస్ చూస్తోంది.

శ్రీనివాస్ యాదవ్ ది హుజూరాబాద్ నియోజకవర్గం కావడం ఒక ప్లస్ పాయింట్ అయితే ఉన్నత విద్యావంతుడు కావడంతో మరో అర్హతగా మారింది..