The entire re-shoot of Raavan’s role in ‘Aadipurush’ : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘ఆది పురుష్’..సుమారు 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ఓంరాత్..నిజానికి ఈ సినిమాకి బాహుబలి పార్ట్ 2 కలెక్షన్స్ ని కొల్లగొట్టేంత సత్తా ఉంది..ఎందుకంటే నార్త్ ఆడియన్స్ ‘శ్రీ రాముడి’ మీద సినిమా తీస్తే నెత్తిన పెట్టుకొనిమరీ ఆరాధిస్తారు..కానీ రిస్క్ కూడా ఉంది..ఇతిహాసాన్ని కాస్త అయినా అపహాస్యం చేస్తే వాళ్ళు ఊరుకోరు..ఆదిపురుష్ సినిమా టీజర్ చూసిన తర్వాత మన అందరికి అలాగే అనిపిస్తుంది.

మోషన్ కాప్చర్ టెక్నాలజీ ద్వారా రామాయణం ని చెప్పాలనుకున్నాడు డైరెక్టర్..కానీ దాని మీద సరిగా వర్క్ చెయ్యలేదు..గ్రాఫిక్స్ మొత్తం కార్టూన్ బొమ్మలను చూస్తున్న అనుభూతిని అభిమానులకు , ప్రేక్షకులకు కలిగించింది.. అదంతా పక్కన పెడితే రావణాసురుడి వేషధారణనే మార్చేసి మన పవిత్రమైన ఇతిహాసాన్ని ఖూనీ చేసేలా తీసినట్టు అనిపించింది..స్పైక్స్ జుట్టు తో మంత్రగాడిలా ఇందులో రావణాసురిడి వేషధారణ ఉంటుంది.
ఆజానుబావుడిలాగా ఉండడమే మనం చూసాము..కానీ ఆదిపురుష్ లో రావణాసురుడిని ఒక ఫకీరు వేషం లో చూపించడం తో డైరెక్టర్ ఓంరాత్ తీవ్రమైన విమర్శలు ఎదురుకున్నాడు..రావణాసురిగా ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించాడు..అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన డేట్స్ కోసం డైరెక్టర్ ఓం రాత్ పడిగాపులు కాస్తున్నాడట..రావణ్ పాత్రని మొత్తం రీ షూట్ చెయ్యడానికే నిర్ణయం తీసుకున్నాడట..ప్రభాస్ ఇచ్చిన సూచనల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అంతే కాకుండా గ్రాఫిక్స్ వర్క్ కూడా మళ్ళీ మొదటి నుండి ప్రారంభించబోతున్నట్టు సమాచారం..దానికి అదనం గా మరో వంద కోట్ల రూపాయిల ఖర్చు..అందుకే ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని జూన్ 16 వ తేదికి వాయిదా వేశారు..రీ వర్క్స్ జరిగిన తర్వాతైనా ఈ చిత్రం కంటెంట్ పై ప్రేక్షకుల్లో ఏర్పడిన నెగటివ్ ఇంపాక్ట్ తొలగుతుందో లేదో చూడాలి.