IND vs ENG: చాలా రోజుల నుంచి ఇండియన్ టీమ్ మూడు ఫార్మాట్లలో వరుస విజయాలను లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక మొదటి మ్యాచ్ లో ఈజీగా గెలవాల్సిన ఇండియా చాలా దారుణంగా ఓడిపోయింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆడుతున్న రెండోవ టెస్ట్ లో ప్రస్తుతం ఇండియన్ టీమ్ విజయం దిశగా ముందుకు దూసుకెళ్తుంది.
ఇక ఇలాంటి క్రమం లోనే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు మన టీమ్ లో దిగ్గజ ప్లేయర్ అయిన కింగ్ విరాట్ కోహ్లీ దూరమైన విషయం మనకు తెలిసిందే. అయితే మూడో మ్యాచ్ నుంచి తను అందుబాటులో ఉంటాడని బిసిసిఐ మొదట్లోనే ఈ విషయం మీద చాలా స్పష్టంగా తన నిర్ణయాన్ని తెలియజేసింది. కానీ ఇప్పుడు వివిధ మాధ్యమాలలో విరాట్ కోహ్లీ 5 టెస్ట్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండే విధంగా కనిపించడంలేదు అంటూ వార్తలైతే వస్తున్నాయి.
ఇక దీని మీద బిసిసిఐ స్పందిస్తూ ‘అవన్నీ ఫేక్ న్యూస్ లు విరాట్ కోహ్లీ మా దగ్గర రెండు టెస్టులకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నాడు, మూడోవ టెస్ట్ నుంచి తను టీమ్ లోకి వస్తాడు’ అంటూ తెలియజేసింది. ఇక దాంతో ప్రస్తుతం కోహ్లీ మీద వచ్చే రూమర్లన్నింటికి బ్రేక్ పడింది. ఇక రేపటితో రెండో టెస్ట్ మ్యాచ్ కూడా ముగియనుంది. ఇక మూడో టెస్ట్ మ్యాచ్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి విరాట్ కోహ్లీ మళ్లీ టీమ్ లోకి వస్తాడు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇది చూసిన అభిమానులు ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీమ్ లో ఉంటేనే టీమ్ మరింత స్ట్రాంగ్ గా తయారవుతుంది అని ఈ విషయం మీద వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే మొదటి మ్యాచ్ లో గెలిచే మ్యాచ్ ను ఇండియన్ టీం చేజేతులారా ఓడిపోయింది.
ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా ఇండియా కి విన్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ చివరి వరకు ఎవరూ గెలుస్తారో తెలియకుండా ఉంది. కాబట్టి మూడో టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ ఉంటేనే టీమ్ స్ట్రాంగ్ గా తయారవుతుంది అలాగే ఇంగ్లాండ్ బౌలర్లు కూడా కొంతవరకు భయం తో బౌలింగ్ చేస్తారని మరికొంత మంది మాజీ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…