https://oktelugu.com/

IND Vs ENG: 112 ఏళ్ల తర్వాత.. కెప్టెన్ గా రోహిత్ అరుదైన ఘనత..

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. బజ్ బాల్ ఆటతో తాము భారత్ పై విజయం సాధించామని.. వచ్చే రోజుల్లో కూడా ఇదే ఆట తీరు ప్రదర్శిస్తామని ఇంగ్లాండ్ కెప్టెన్ ప్రకటించాడు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 9, 2024 / 04:55 PM IST

    IND Vs ENG

    Follow us on

    IND Vs ENG: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను 4-1 తేడాతో భారత్ గెలిచిన నేపథ్యంలో అనేక విశేషాలు తెరపైకి వస్తున్నాయి. అందులో విశేషంగా ఆకట్టుకుంటుంది ఒకటుంది. ఈ టెస్ట్ సెల్ఫ్ విజయం ద్వారా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు. 11 సంవత్సరాల తర్వాత ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ ఓటమిపాలై.. 4-1 తేడాతో సిరీస్ జట్టు సొంతం చేసిన కెప్టెన్ గా రోహిత్ అరుదైన ఘనత సాధించాడు.

    ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. బజ్ బాల్ ఆటతో తాము భారత్ పై విజయం సాధించామని.. వచ్చే రోజుల్లో కూడా ఇదే ఆట తీరు ప్రదర్శిస్తామని ఇంగ్లాండ్ కెప్టెన్ ప్రకటించాడు. అతడు చేసిన ఆ వ్యాఖ్యలు భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ఆటగాళ్లలో విపరీతమైన కసి పెరిగింది. దీంతో వరుసగా విశాఖపట్నం, రాజ్ కోట్, రాంచి, ధర్మశాల వేదికల్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో భారత్ విజయాలు సాధించింది. ముఖ్యంగా రాజ్ కోట్ టెస్టులో అయితే ఏకంగా 434 పరుగుల తేడాతో భారత జట్టు తన టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. ధర్మశాలలో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. అయితే హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో లీడ్ సాధించినప్పటికీ.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది.

    ఈ నాలుగు విజయాల ద్వారా స్వదేశంలో తమకు తిరుగులేదని భారత ఆటగాళ్లు నిరూపించారు.. ముఖ్యంగా ఇంగ్లాండ్ బజ్ బాల్ పప్పులు మా దగ్గర ఉడకవని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ ఆటగాళ్ల బజ్ బాల్ విధానానికి దీటుగా భారత క్రీడాకారులు ఆడారు. అందువల్లే సిరీస్ విజయం సాధ్యమైంది. మరోవైపు బజ్ బాల్ ఆటకు సమర్థవంతమైన బదులిచ్చి సిరీస్ కూడా కైవసం చేసుకున్న తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్, మెక్ కల్లమ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే. బజ్ బాల్ ఆట తీరు తో ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ క్రికెట్ కు సరికొత్త ఊపు తీసుకొచ్చిన ఈ ద్వయం.. భారత్ తో జరిగిన సిరీస్ లో 1-4 ఓటమి ద్వారా నిరాశలో మునిగిపోయింది. మరోవైపు ధర్మశాల లో గెలుపు తో సొంత గడ్డపై భారత్ 400వ టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది.