https://oktelugu.com/

Tollywood: మన హీరోలు ఒక పెళ్లి ఫంక్షన్ కి వెళితే ఎంత తీసుకుంటారో తెలుసా..?

ముఖ్యంగా సినిమా హీరోలకి ఉన్నంత క్రేజ్ అయితే మరేవరికి ఉండదు... ఇలాంటి క్రమంలోనే బిజినెస్ మాన్ ల ఇంట్లో జరిగే వెడ్డింగ్ ఫంక్షన్లకి స్టార్ హీరోలని ఆహ్వానిస్తూ ఉంటారు.

Written By: , Updated On : March 9, 2024 / 04:53 PM IST
Tollywood Heroes

Tollywood Heroes

Follow us on

Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలను ప్రేక్షకులు దేవుళ్ల లా చూస్తారు. ఇక వాళ్లని బయట రియల్ గా ఒక్కసారైనా చూడాలని చాలా ఉత్సాహపడుతూ ఉంటారు. ఇక వాళ్లతో మాట్లాడితే మాత్రం వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. అలా చేస్తే మాత్రం వాళ్లు జీవితాన్ని జయించినంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి మన దేశంలో రాజకీయ నాయకులకి, సినిమా హీరోలకి, క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్ మరేవరికి ఉండదనే చెప్పాలి.

ముఖ్యంగా సినిమా హీరోలకి ఉన్నంత క్రేజ్ అయితే మరేవరికి ఉండదు… ఇలాంటి క్రమంలోనే బిజినెస్ మాన్ ల ఇంట్లో జరిగే వెడ్డింగ్ ఫంక్షన్లకి స్టార్ హీరోలని ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక దానికోసం వాళ్లకి డబ్బులను కూడా ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో నాగార్జున(Nagarjuna) ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒక పెళ్లి ఫంక్షన్ కి వచ్చి ఒక 20 నిమిషాలు పార్టీకి అటెండ్ అయ్యి వెళ్ళిపోయినందుకు లక్షల్లో చెల్లిస్తామని చెప్పేవారట. కానీ నాగార్జునకి మాత్రం అలా వెళ్ళడం ఇష్టం ఉండదని చెప్పాడు.

ఈయన ఈ మాటలు చెప్పి దాదాపు పది సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఇప్పుడు ఒక స్టార్ హీరో ఒక పెళ్లి ఫంక్షన్ కి రావాలంటే దాదాపు కోట్లలో చెల్లించాల్సి ఉంటుందనే చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా అంబానీ తన కొడుకు అయిన అనంత్ అంబానీ కి పెళ్లి చేశాడు. ఇక ఈ ఈవెంట్ లో ఇండియాలో ఉన్న స్టార్ సెలబ్రిటీస్ అందరూ హాజరయ్యారు.

తెలుగు నుంచి రామ్ చరణ్ ఉపాసన తో పాటు ఆ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు. అయితే రామ్ చరణ్ కి అంబానీ ఎంత చెల్లించాడు అనే విషయాలు ఏమి తెలియదు కానీ, ఈ ఫంక్షన్ కోసం అంబానీ దాదాపు 1000 కోట్లకు పైన ఖర్చుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇండియాలో ఉన్న రిచెస్ట్ పర్సన్ లో ముకేశ్ అంబానీ ఒకరు. కాబట్టి తన కొడుకు పెళ్లి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఆయన అంబానీ ఎందుకు అవుతాడు అని మరి కొంతమంది ఆయన గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. ఇక అప్పుడెప్పుడో నాగార్జున చెప్పిన మాటలని ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లికి అన్వయిస్తూ వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు…