Homeక్రీడలుక్రికెట్‌Ind Vs Eng 5th Test Kumar Dharmasena: భారత్ కు వ్యతిరేకంగా.. ఇంగ్లాండ్ కు...

Ind Vs Eng 5th Test Kumar Dharmasena: భారత్ కు వ్యతిరేకంగా.. ఇంగ్లాండ్ కు అనుకూలంగా.. ధర్మసేన దీన్ని అంపైరింగ్ అంటారా..

Ind Vs Eng 5th Test Kumar Dharmasena: ఆటగాళ్లు తమ జట్టు కోసం ఆడతారు. అంపైర్లు మాత్రం నియమ నిబంధనలు పాటిస్తూ… ఆటను పర్యవేక్షిస్తూ ఉంటారు.. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా విజేతను ఆవిర్భవించేలా చేస్తారు. అందువల్ల క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అయింది. కానీ ఒక అంపైర్ తన బాధ్యతలను నిర్వహించే తీరులో నిర్లక్ష్యం వహించాడు. ఉభయ పక్షాలను పర్యవేక్షించే అతడు.. ఏకపక్షంగా మారిపోయాడు. ఇప్పుడు అతడి వ్యవహారం సామాజిక మాధ్యమాలలో చర్చకు దారితీస్తోంది.

Also Read: నారా లోకేష్ ఓ గొప్ప మాట చెప్పాడు..

లండన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదవ టెస్ట్ ఆడుతున్నాయి. తొలి రోజు టీమిండియా 204 పరుగులు చేసింది. ఆరు వికెట్లు నష్టపోయింది. ప్రస్తుతం క్రీజ్ లో నాయర్(51*), వాషింగ్టన్ సుందర్(19*) ఉన్నారు. వీరిద్దరూ ఏడో వికెట్ కు ఇప్పటివరకు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. యశస్వి జైస్వాల్ (2), రాహుల్ (14), సాయి సుదర్శన్ (38), గిల్(21), జడేజా (9), ధృవ్ జూరెల్(19) పరుగులు చేశారు. తొలి రోజు మ్యాచ్ కి వర్షం పదేపదే అంతరాయం కలిగించింది. పిచ్ మీద పచ్చిక ఉండడంతో బంతి వేగంగా దూసుకు వచ్చింది. దీంతో భారత ప్లేయర్లు ఇంగ్లాండ్ బౌలర్ల ముందు తలవంచారు. వికెట్లు కాపాడుకోవడంలో విఫలమయ్యారు. పేరుపొందిన ఈ ఒక్క బ్యాటర్ కూడా గొప్పగా చెప్పుకునే స్కోర్ చేయలేకపోయాడు. దీంతో భారత్ భారీ భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయింది.

భారత తొలి ఇన్నింగ్స్ సమయంలో అంపైర్ కుమార్ ధర్మసేన వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇంగ్లాండ్ జట్టు రివ్యూ కోల్పోకుండా ఆయన సహాయం చేశారని ఫైర్ అవుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ టంగ్ వేసిన బంతి సుదర్శన్ ప్యాడ్లకి తాకింది. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు అప్పిలు చేశారు. ధర్మసేన తల అడ్డంగా నాట్ అవుటని ప్రకటించాడు. పైగా బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తగిలిందని ఇంగ్లాండ్ ప్లేయర్లకు తెలిసే విధంగా చేతులతో సంకేతాలు ఇచ్చాడు. ఇంతవరకు రివ్యూకు వెళ్లలేకపోయారు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టుకు ఒక రివ్యూ సేవ్ అయింది. ధర్మసేన వ్యవహరించిన తీరు పట్ల టీం ఇండియా అభిమానులు మండిపడుతున్నారు. న్యూట్రల్ గా ఉండాల్సిన అంపైర్ ఇలా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ధర్మసేనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular