Today 1 August 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశరాసులపై స్వాతీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకుంటారు. వ్యాపారం లోకి కొత్తవారు చేరుతారు. దీంతో మరింత అభివృద్ధి చెంది అవకాశం ఉంటుంది. ఉద్యోగులు పెయింటింగ్ పనులను పూర్తి చేస్తారు. ఏవైనా సమస్యలు ఉంటే ఈరోజు తొలిగిపోతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : స్నేహితులతో కలిసి సరదాగా ఉంటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. దాని గురించి రుణం పొందుతారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఏమైనా విభేదాలు వస్తే ఓపికతో ఉండాలి. కొందరు వీరి పనులకు అడ్డంకులు సృష్టిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు దూర ప్రయాణం చేస్తే జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి మద్దతుతో కొత్తగా పెట్టుబడును పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . కర్కాటక రాశి వారు ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఏవైనా చిన్న సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో పోటీ పరీక్షల్లో పాల్గొని విజయం సాధిస్తారు. వ్యాపారులు ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లడంతో అనుకున్న ఆర్థిక లాభాలు పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు. ఇంట్లోని రహస్యాలను స్నేహితులతో చెప్పకుండా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వకూడదు. ఇతరుల వద్ద పెండింగ్ లో ఉన్న డబ్బులు వెంటనే వసూలు చేసుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . నిరాశ ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు తోటి వారే ప్రతికూల మైన వాతావరణంతో ఉంటారు. అధికారులు కాస్త విమర్శలు చేస్తారు. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకుండా ఉండాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. దీంతో వారికి అధిక లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సవాలను ఎదుర్కొంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అనవసరంగా డబ్బు ఇవ్వకుండా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. . ఈ రాశి వారు ఈరోజు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. వ్యాపారులు స్వల్ప లాభాల కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. గతంలో అనుకున్న ఒక పని పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వివాహానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎవరితోనైనా వాదనలు జరిగితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. రాజకీయాలలో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైన ఫలితాలు పొందుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. అయినా తోటి వారి సహాయంతో అనుకున్నా లక్ష్యాన్ని పూర్తి చేయాలి. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. నిర్లక్ష్యంగా ఉండకుండా వైద్యులను సంప్రదించాలి. పిల్లల కెరీర్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎగుమతి వ్యాపారం చేసేవారు కొత్త ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఒక బలమైన ప్రాజెక్టు పొందుతారు. దీంతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగులు అదనపు బాధ్యతలను చేపడతారు. దీంతో అదనపు ఆదాయం సమకూరే అవకాశముంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులను నమ్మకుండా ఉండాలి. వ్యాపారులు తోటి వారితో సమయమును పాటించాలి.