Chris Woakes Batting: ఏం మ్యాచ్ ఇది.. ఎన్ని టి20 లు గెలిస్తే ఇంతటి మజా వస్తుంది.. ఎన్ని వరల్డ్ కప్పులు సాధిస్తే ఇంతటి హాయి లభిస్తుంది.. చూస్తోంది టెస్ట్ మ్యాచ్చేనా.. బంతి బంతికి సమీకరణ మారుతుంది.. పరుగు పరుగుకు ఉత్కంఠ కలుగుతోంది. చాలామంది నరాలు తెగే ఒత్తిడిని అనుభవించారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.. ఏం చేస్తున్నారో అంతుపట్టడం లేదు.. నిజంగా ఇలా కూడా జరుగుతుందా.. ఇలా కూడా చేస్తారా.. ఇలా కూడా అవుతుందా.. అనే అనుభవాన్ని ప్రేక్షకులకు, అభిమానులకు కలిగించాయి ఇంగ్లాండ్, ఇండియా జట్లు.
Also Read: వాషింగ్టన్ సుందర్ సిక్సర్ల హోరు.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాటల జోరు.. అదిరింది పో..
లండన్ ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 35 పరుగులు చేయాలి. భారత్ విజయం సాధించాలంటే నాలుగు వికెట్లు తీయాలి. వాస్తవానికి మ్యాచ్ రసపట్టులో ఉందన్న విషయం తెలుసు. కాకపోతే టీమ్ ఇండియా బౌలర్లు నాలుగో రోజు తీవ్రంగా అలసిపోయిన నేపథ్యంలో విజయం సాధ్యమవుతుందా అనే ప్రశ్న అందరి నుంచి వినిపించింది. పైగా రూట్, బ్రూక్ సెంచరీలతో అదరగొట్టారు. ఏకంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ద్వారా 374 టార్గెట్ విధించిన టీమ్ ఇండియాకు చుక్కలు చూపించారు. ఈ దశలోనే రూట్ అవుట్ కావడం.. బ్రూక్ వెళ్లిపోవడంతో.. మ్యాచ్ ఒక్కసారిగా టీమ్ ఇండియా చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత బెతెల్ వికెట్ కూడా పడగొట్టడంతో టీమ్ ఇండియా గెలుస్తుందనే ఆశలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వర్షం కురవడంతో మ్యాచ్ ఆపేశారు. దీంతో ఐదో రోజు ఆట కొనసాగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..
ఇక ఐదో రోజు సిరాజ్ టీమిండియాకు దిమ్మతిరిగిపోయే బహుమతి ఇచ్చాడు.. భయంకరమైన స్మిత్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత సిరాజు ఓవర్టెన్ వికెట్ పడగొట్టాడు. ఇదే క్రమంలో ప్రసిద్ద్ కృష్ణ టంగ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ కోల్పోయింది. ఈ దశలో క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు రావలసిన పరిస్థితి ఏర్పడింది. తొలి ఇన్నింగ్స్ లో అతని భుజానికి తీవ్రంగా గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలో నుంచి వెళ్లిపోయాడు. గత నాలుగు రోజులుగా అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. చివరి రోజు ఇంగ్లాండ్ మూడు వికెట్లు వెంట వెంటనే కోల్పోవడంతో వోక్స్ బ్యాటింగ్ కి వచ్చాడు. కాకపోతే అతడు ఒంటి చేత్తో బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చాడు. భుజం నొప్పి తగ్గకపోవడంతో.. అతడు కేవలం ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అతడు మైదానంలోకి బ్యాటింగ్ కు వస్తున్నప్పుడు ఇంగ్లాండ్ అభిమానులు చప్పట్లు కొట్టారు. టీమిండి ఆటగాళ్లు కూడా అతడు క్రీడా స్ఫూర్తి కి ఫిదా అయ్యారు.. ఇటీవల కాలంలో టెస్ట్ క్రికెట్లో ఈ తరహా సన్నివేశం ఎప్పుడూ చోటు చేసుకోలేదు.