IND Vs ENG 3rd T20: ఈ సిరీస్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి. ఈ రెండు మ్యాచ్ లు ఇంగ్లాండ్ పేస్ బౌలర్లు వర్సెస్ టీమ్ ఇండియా స్పిన్ బౌలర్లు అన్నట్టుగా జరిగాయి. ఇప్పటికే టీమ్ ఇండియా రెండు మ్యాచ్లు గెలిచిన నేపథ్యంలో..రాజ్ కోట్ లో కనుక గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్లలో ఓటమి ద్వారా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం దాదాపు దెబ్బతిన్నది. చెన్నైలో గెలిచే అవకాశం లభించినప్పటికీ తిలక్ మొండిగా పోరాటంతో ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్ జట్టు ఆశలు ఈ సిరీస్ పై సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిందే. లేకుంటే ఇక అంతే సంగతులు.
సారథి ఏంటిది?
గత ఏడాది టీమిండియా టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించాడు. జట్టును నడిపించే విషయంలో అతడికి వంకపెట్టే తీరు లేకపోయినప్పటికీ.. అతడు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేక పోతున్నాడు.. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్లో 0 పరుగులకు అవుట్ కాగా.. రెండవ మ్యాచ్లో 12 పరుగులు మాత్రమే చేశాడు.. సూర్య కుమార్ కుమార్ తన చివరి 10 ఇన్నింగ్స్ లలో కేవలం ఒక్క ఆఫ్ సెంచరీ మాత్రమే చేశాడంటే అతని బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సంజు శాంసన్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు. చెన్నై మ్యాచ్లో అదే జరిగింది. అభిషేక్ శర్మ కోల్ కతా లో సత్తా చాటినప్పటికీ.. చెన్నైలో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయాడు. అతడు తన ఆట తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు జూరెల్ స్థానంలో శివం లేదా రమణ్ దీప్ కు చోటుదక్కే అవకాశం కల్పిస్తోంది. ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ రషీద్ మిడిల్ ఓవర్ లలో అదరగొడుతున్నాడు. అయితే అతడిని ఎదుర్కోవడానికి శివం దూబె కు అవకాశం ఇవ్వచ్చు. మరోవైపు స్పెషలిస్ట్ పేస్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్, స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి చెన్నైలో తేలిపోయారు.. ఒకవేళ పేస్ బౌలింగ్ ను టీమిండియా కనుక బలోపేతం చేయాలనుకుంటే రవి బిష్ణోయ్ స్థానంలో షమీకి చోటు దక్కే అవకాశం ఉంది. ఇక్కడ మైదానం కూడా అత్యంత కఠినంగా ఉంది. ఒకవేళ ఈ మైదానంపై టాస్ గెలిచిన జట్టు టాప్ ఆర్డర్ వేగంగా కనక ఆడితే ప్రత్యర్థి ఎదుట భారీ టార్గెట్ అవకాశం ఉంటుంది.
మార్పులు లేకుండానే..
చెన్నై మైదానంలో ఆడిన ఆటగాళ్లతోనే ఇంగ్లాండ్ రాజ్ కోట్ లో బరిలోకి దిగుతోంది. అయితే ఇంగ్లాండ్ జట్టు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. కెప్టెన్ బట్లర్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతడికి ఇతర ఆటగాళ్ల నుంచి ఏమాత్రం సహకారం లభించడం లేదు. బ్రూక్, లివింగ్ స్టోన్ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. తొలి టి20లో జెమీ స్మిత్ అదరగొట్టినప్పటికీ.. అదే జోరు చివరి వరకు కొనసాగించలేకపోయాడు. బ్రెండన్ కార్స్ కూడా స్థిరమైన ఇన్నింగ్స్ ఆడ లేకపోతున్నాడు. ఇక ఆర్చర్ చెన్నైలో దారుణంగా పరుగులుచుకున్నాడు. కేవలం రషీద్ మాత్రమే భారత బ్యాటర్లను అడ్డుకోగలుగుతున్నాడు.
తుది జట్లు ఇవే..
భారత్ (అంచనా మాత్రమే)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జురెల్/, శివమ్ దూబె/, రమణ్ దీప్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ / మహమ్మద్ షమీ, అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్
బట్లర్ (కెప్టెన్), డకెట్, సాల్ట్, బ్రూక్, లివింగ్ స్టోన్, స్మిత్, ఓవర్టెన్, కార్స్, రషీద్, ఆర్చర్, ఉడ్.
ఇక రాజ్ కోట్ మైదానం ప్రతిసారి బ్యాటర్ల కే సహకరిస్తుంది. ఇక్కడ ఐదు టి20 లో జరిగాయి. అయితే తొలి మ్యాచ్ ఇన్నింగ్స్ సగటు కేవలం 108 పరుగులు మాత్రమే. ఇక చివరి మ్యాచ్లో భారత జట్టు శ్రీలంకతో తలపడి 228/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈనెల ప్రారంభంలో భారత మహిళల జట్టు ఐర్లాండ్ పై రెండు వన్డేల తలపడి.. 370, 435 భారీ పరుగులు చేసింది.. ఈ ప్రకారం చేసుకుంటే ఇంగ్లాండ్, భారత్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించే అవకాశం ఉందని క్యూరేటర్ చెబుతున్నారు.