Bigg Boss Kannada 11 Grand Finale: వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్‌కి (Bigg Boss) ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా బిగ్ బాస్‌కి పాపులారిటీ ఉంది. తెలుగు, తమిళం, హిందీ ఇలా ఏ భాషలో అయినా కూడా బిగ్ బాస్ (Bigg Boss) అంటే ప్రేక్షకులు చూస్తుంటారు. ప్రేక్షకులు ఎవరికి ఓట్లు వేస్తారో.. ఎవరిని గెలిపిస్తారనేది ఎవరూ ఊహించలేరు. ఇప్పటి వరకు హిందీ భాషలో ఎక్కువ సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కూడా పూర్తి అయ్యింది. అయితే తాజాగా కన్నడ బిగ్ బాస్ సీజన్ (Kannada Bigg Boss) 11 ముగిసింది. స్టార్ హీరో కిచ్చా సుదీప్ కన్నడ బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా వ్యవహరించారు. దాదాపుగా 120 రోజుల పాటు సాగిన ఈ కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 గ్రాండ్ ఫినాలో ఆదివారం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సీజన్ విన్నర్‌గా రైతు బిడ్డ హనుమంత లామా నిలిచాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ విన్నర్‌గా నిలవడంతో అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా వైల్డ్ కార్డు ఎంట్రీ వాళ్లు మధ్యలో వస్తారు. వీరు బయట ఆటను చూసి వస్తారని విన్నర్ అయ్యే ఛాన్స్‌లు వీరికి చాలా తక్కువగా ఉంటాయి. కానీ కన్నడ బిగ్ బాస్‌లో ఇవేవి చూడకుండా.. ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వారికే విన్నర్‌ను ఇస్తారు.
ఇలా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన హనుమంతకు ప్రేక్షకులు ఓట్లు ఎక్కువగా వేయడంతో విన్నర్‌గా నిలిచాడు. ఇతనికి దాదాపుగా రూ.50 కోట్ల ప్రైజ్ మనీతో పాటు లగ్జరీ కారు, ట్రోఫీని అందించారు. కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 విజేతగా హనుమంత గెలవగా రన్నరప్‌గా త్రివిక్రమ్ నిలిచాడు. ఇతనికి రూ.10 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఈ బిగ్ బాస్ సీజన్‌కి మొత్తం 20 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఫైనల్‌కి హనుమంతు, త్రివిక్రమ్, రజత్, మోక్షిత, మంజు టాప్ 5కి వెళ్లారు. రజత్, మోక్షిత, మంజు మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు.
హనుమంత ఎలాంటి అంచనాలు లేకుండా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. కర్ణాటకలోని హవేరిలో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. హనుమంత చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడు. ఇలా సరిగమపలో 2018లో కన్నడ 15వ సీజన్‌లో పార్టిసిపేట్ చేశాడు. ఇక్కడ రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2019లో మళ్లీ కర్ణాటక డాన్స్ ఫ్యామిలీ వార్ సీజన్ 2లో పాల్గొనడంతో పాటు, 2023లో ఓ రియాల్టీ షో కూడా చేశాడు. ఇలా బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులు మనస్సులు గెలిచాడు. హనుమంత, త్రివిక్రమ్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. హనుమంతకి దాదాపుగా 5 కోట్లు ఓట్లు వచ్చాయి. త్రివిక్రమ్‌కి 2 కోట్లు మాత్రమే రావడంతో విన్నర్‌గా హనుమంత గెలిచాడు.