IND vs ENG 2nd Test Shubman Gill: ఇంగ్లీష్ జట్టు మీద టీమ్ ఇండియా సారధి గిల్ డబుల్ సెంచరీ చేశాడు.. తద్వారా రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా స్కోరును 587 పరుగులకు చేర్చాడు.. గిల్ 269 పరుగులు చేశాడు. ఏడో వికెట్ కు వాషింగ్టన్ సుందర్(23) తో కలిసి 82 పరుగులు జోడించాడు. తద్వారా టీమిండియా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. అత్యంత కీలకమైన ఆరో వికెట్ కు జడ్డు (89) తో కలిసి గిల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇదే ఊపులో ద్వి శతకం సాధించాడు.
డబుల్ సెంచరీ సాధించిన భారత జట్టు సారధిగా గిల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం గిల్ వయసు 25 సంవత్సరాల 298 రోజులు. టీం ఇండియాలో 23 సంవత్సరాల 39 రోజుల వయసులో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ డబుల్ సెంచరీ చేశాడు. 1964లో ఢిల్లీ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు ఈ ఘనత సాధించాడు. అత్యంత తక్కువ వయసులో టీమిండియా సారధిగా డబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్ల జాబితాలో పటౌడీ తొలి స్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో గిల్ కొనసాగుతున్నాడు..
25 సంవత్సరాల 298 రోజుల వయసులో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా రెండవ సారథిగా గిల్ నిలిచాడు.
1999లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశాడు. అప్పుడు సచిన్ వయసు 26 సంవత్సరాల 189 రోజులు.
2016లో నార్త్ సౌండ్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడు. 27 ఏళ్ల వయసులో టీమ్ ఇండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ ఘనత సృష్టించాడు.
ఇక ఇంగ్లీష్ గడ్డమీద ఇప్పటివరకు 11 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో నాలుగు ఆతిథ్య జట్టు నుంచి, ఏడు పర్యాటక జట్ల నుంచి నమోదయ్యాయి. ఇందులో గ్రేమ్ స్మిత్ రెండు డబుల్ సెంచరీలు చేశాడు.. 2003లో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఎడ్జ్ బాస్టన్, లార్డ్స్ లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. 22 సంవత్సరాల వయసులో అతడు ఈ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును సృష్టించిన అత్యంత పిన్న వయసున్న ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించాడు.. విభిన్నమైన వేదికలలో స్మిత్ రెండు ద్వి శతకాలు సాధించాడు. తద్వారా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంతవరకు స్మిత్ రికార్డును ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేకపోయాడు. అయితే ఇప్పుడు టీమిండియా నుంచి ఆ రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుత టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు బీకరమైన ఫామ్ లో ఉన్నారు.. వారి జోరు చూస్తుంటే కచ్చితంగా సరికొత్త చరిత్ర సృష్టించే విధంగా కనిపిస్తున్నారు.