3 BHK Full Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలతో చాలామంది దర్శకులు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు… ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సిద్దార్థ్ మెయిన్ లీడ్ గా వచ్చిన 3 బిహెచ్ కే అనే సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: సిద్దార్థ్ 3BHK మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..ఆడియన్స్ ఈసారైనా కనెక్ట్ అయ్యారా?
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్న శరత్ కుమార్ తన జీవితంలో ఒక 3 బి హెచ్ కే ఫ్లాట్ ని కొనాలనే డ్రీమ్ తో ముందుకు సాగిస్తూ ఉంటాడు. తన కొడుకు అయిన సిద్ధార్థ సైతం ఆ ప్లాట్ కొనాలని ఒకే ఒక టార్గెట్ తో జాబ్ చేయాలని నిర్ణయించుకుని ముందుకు సాగుతాడు. ఇక ఈ క్రమంలో సిద్దార్థ్ వెళ్ళిన ప్రతిచోట అతనికి జాబ్ రాదు. ఆయన జాబ్ కి సెట్ అవ్వడు అని చాలామంది చెబుతున్నప్పటికి ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా జాబ్ కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతాడు. మొత్తానికైతే వీళ్ళు 3 బిహెచ్ కే ఫ్లాట్ కొన్నారా? లేదా అనే విషయం తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు శ్రీ గణేష్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని ఈ సినిమాని చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఒక డ్రామా ని ప్లే చేయగలిగితే సినిమా ఆటోమేటిగ్గా సూపర్ సక్సెస్ అవుతుంది అనే ఒక సూత్రాన్ని తెలుసుకుంటే ఈజీగా సక్సెస్ ని సాధించవచ్చు…
ఇక 3 బిహెచ్ కే సినిమా ద్వారా శ్రీ గణేష్ సైతం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తెరమీద చూపించడంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఆ ఎమోషన్స్ అయితే హత్తుకునే విధంగా ఉన్నాయి. ఆయన రాసుకున్న సన్నివేశాలు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించే విధంగా ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత సిద్దార్థ్ శరత్ కుమార్ ఇద్దరి మధ్య వచ్చే ఒక సన్నివేశాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు ఏడుస్తాడనే చెప్పాలి…దర్శకుడు ఎప్పటికప్పుడు ఈ సినిమా ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. కానీ ఇందులో ఇంటర్నల్ గా కూడా కొంతవరకు ప్రేక్షకుడి రిలాక్సేషన్ కోసం కామెడీని పండించి ఉంటే బాగుండేది. ఎంతసేపు ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిప్పడం వల్ల ప్రేక్షకులకు పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వకపోవచ్చు. ఇక సినిమాలో ఉన్న కోర్ ఎమోషన్ ని మొదటి నుంచి ప్రేక్షకుడికి ఇంట్రడ్యూస్ చేస్తూ చివరి వరకు అదే టెంపోను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగారు.
మధ్య మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్స్ వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా కుదిరింది. దాని వల్ల కూడా సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుంది… నిజానికి ఒక ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రీమ్ దాన్ని కరెక్ట్ గా హుక్ చేసుకొని ఎమోషన్ తోనే సినిమాని రన్ చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి… అయితే కథ మొత్తం ఒకే పాయింట్ మీద తిరగడం వల్ల మూవీని బాగా లాగినట్టుగా అనిపించింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో సిద్ధార్థ్ చాలా చక్కటి నటన ను ప్రదర్శించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తులు ఎలా ఉంటారు వాళ్ల మీద ఎలాంటి బరువు బాధ్యతలు ఉంటాయి. వాటిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడానికి వాళ్ళు ఎలా కష్టపడతారు అనేది చాలా పర్ఫెక్ట్ గా చూపించాడు…తండ్రి పాత్రలో నటించిన శరత్ కుమార్ సైతం ఆ హుందాతనాన్ని అక్కడ చెడిపోకుండా సినిమా చివరి వరకు మైంటైన్ చేస్తూనే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఒక నాన్న అనే వ్యక్తి ఎన్ని కోర్కెలను అనుచుకుంటూ తన కుటుంబాన్ని లీడ్ చేస్తాడు.
తన పిల్లల కోసం ఎన్ని సార్లు కాంప్రమైజ్ అవుతూ బతుకుతూ ఉంటాడు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్ గా చూపించారు… దేవయాని సైతం ఒక మిడిల్ క్లాస్ మదర్ ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా అందులో ఒదిగిపోయి నటించి మెప్పించారు… ఫ్యామిలీకి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్లంతా ఎలా పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఒక బాధ కలిగినప్పుడు ఒక తల్లి తన భర్తని కొడుకుని ఎలా ఓదారుస్తుంది అనేది దేవయాని చాలా బాగా నటించి మెప్పించిందనే చెప్పాలి…ఇక మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అమృత్ రామ్ నాథ్ ఎమోషనల్ సీన్స్ కి చాలా చక్కటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే అందించాడు…ఇక ఈ మూవీ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే విజువల్స్ పరంగా సినిమా టాప్ నాచ్ లో ఉంది…ప్రతి షాట్ ను చాలా చక్కగా డిజైన్ చేశారు…ఎక్కడ కూడా అనవసరమైన షాట్ ఒక్కటి కూడా లేదనే చెప్పాలి…ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమా టెక్నికల్ గా చాలా బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి…
ప్లస్ పాయింట్స్
కథ
సిద్దార్థ్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
ఒకే పాయింట్ ను బాగా లాగారు…
కొన్ని అనవసరమైన సీన్స్
స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బాగా రాసి ఉంటే బాగుండేది…
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.25/5
