https://oktelugu.com/

IND vs BAN: టీమిండియాను ఓడిస్తే మీతో డేట్ కొస్తాను.. ఏమైనా చేసుకోండి.. హీరోయిన్ బోల్డ్ ఆఫర్ వైరల్

ఇప్పటికే ఇండియా టాప్ టీమ్స్ అయిన ఆస్ట్రేలియా, పాకిస్తాన్ టీం లను ఘోరంగా ఓడించింది. 200 పరుగులను కూడా చేయకుండా కట్టడి చేసి వాళ్ళని చిత్తుగా ఓడించింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు

Written By:
  • Gopi
  • , Updated On : October 18, 2023 / 08:25 PM IST
    Follow us on

    IND vs BAN : ఇండియా పాకిస్తాన్ టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోవడం తో ఆ ఓటమిని పాకిస్తాన్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అంతకు ముందు జరిగిన ఏషియా కప్ లో ఇండియా పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించింది. దాంతో ఈ వరల్డ్ కప్ లో జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ ఇండియా పైన విజయం సాధిస్తుంది అని పాకిస్తాన్ అభిమానులు అందరూ కోరుకున్నారు, కానీ ఇండియా వాళ్ళందరికీ షాకిస్తూ పాకిస్తాన్ ను ఇండియా మరోసారి చిత్తు చిత్తు చేసేసింది. దాంతో కనీస పోటీ కూడా ఇవ్వలేక పాకిస్తాన్ టీమ్ చేతులెత్తేసింది.

    ఇవన్నీ జీర్ణించుకోలేని పాకిస్తాన్ అభిమానులు ఇండియా టీమ్ పైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ఇండియాకి పోయేది ఏమీ లేదు. ఎందుకంటే ఇండియన్ టీం ఇప్పటికే మూడు మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. కాబట్టి ఇండియా ఓడిపోతే చూడాలి అని పాకిస్తాన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న టీముల్లో ఇండియన్ టీమ్ ని ఓడించే సత్తా ఉన్న టీం ఏది కనిపించడం లేదు అనే విషయం వాళ్లకు తెలియదు. ఎందుకంటే ఇండియన్ టీం ఇప్పుడు డబుల్ పవర్ తో ముందుకు దూసుకెళ్తుంది.

    ఈ క్రమంలోనే ఈనెల 19వ తేదీన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీమ్ ల మధ్య ఒక మ్యాచ్ జరగనుంది.ఇక దీంట్లో భాగం గానే బంగ్లాదేశ్ ప్లేయర్లు కనక ఇండియన్ టీమ్ ని ఓడిస్తే బంగ్లా ప్లేయర్లతో నేను డేట్ కి వెళ్తాను అని పాకిస్తాన్ నటి అయిన సెహ‌ర్ షిన్వారి సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఏమని ఉంది అంటే భారత్ తో ఆడే మ్యాచ్ లో మా బంగ్లా బంధువులు ఇండియన్ టీం పైన ప్రతీకారం తీర్చుకుంటారు. ఇలా తను ఒక పోస్ట్ ని పెట్టడం జరిగింది ఇది చూసిన ఇండియన్ అభిమానులు అందరూ కూడా ఇండియన్ టీమ్ ని ఓడించడం మీ జట్టు వల్లే కాలేదు ఈ బంగ్లాదేశ్ తో ఏమవుతుంది. అయిన అనవసరపు కామెంట్లు చేయడం వల్ల ఇండియాకు పోయేది ఏమీ లేదు అలా కామెంట్ చేయడం వల్ల మీ పరువు పోవడం తప్ప ఏమి ఉండదు అని కొంచం ఘాటుగా రిప్లైలు ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఇండియన్ టీం ను ఓడించడం బంగ్లాదేశ్ కి ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో అయితే చాలా కష్టం.

    ఎందుకంటే ఇప్పటికే ఇండియా టాప్ టీమ్స్ అయిన ఆస్ట్రేలియా, పాకిస్తాన్ టీం లను ఘోరంగా ఓడించింది. 200 పరుగులను కూడా చేయకుండా కట్టడి చేసి వాళ్ళని చిత్తుగా ఓడించింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇండియన్ టీం బౌలర్లు గాని, బ్యాట్స్ మెన్స్ గాని ఎంత పవర్ ఫుల్ గా ఉన్నారు అనేది..ఇక ఇలాంటి సిచువేషన్ లో బంగ్లాదేశ్ లాంటి ఒక చిన్న టీం ఇండియా ని ఓడిస్తుంది అంటే అది చాలా నమ్మశక్యం కాని విషయం అనే చెప్పాలి. ఇంతకుముందు 2007లో ఇండియన్ టీం ను బంగ్లాదేశ్ ఒక్కసారి వరల్డ్ కప్ లో ఓడించినప్పటికీ అప్పుడు ఉన్న టీమ్ కంటే ఇప్పుడు ఉన్న టీం చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియన్ టీం ని ఓడించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి… కాబట్టి పాకిస్తాన్ టీం ఓడిపోయిన పర్లేదు కానీ మన ఇండియా టీమ్ మాత్రం గెలవకూడదు అని వాళ్ల అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు.అందుకే కనీసం వాళ్ళ టీం గెలవాలని కూడా కోరుకోలేని వారు మన టీమ్ ఓడిపోవాలని మాత్రం కోరుకుంటున్నారు…