IND vs AUS Viral Video: ఒకప్పుడు టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది అంటే విపరీతమైన ఉత్కంఠ ఉండేది. మీడియాలో ప్రచారం తార స్థాయికి చేరేది. స్టేడియాలలో ప్రేక్షకుల హోరు ఆకాశాన్ని అంటేది. ఆపరేషన్ సిందూర్ తర్వాత టీమిండియా, పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల ఆసియా కప్ జరిగినప్పుడు మైదానంలో ప్రేక్షకులు అంతగా కనిపించలేదు. కేవలం టీవీలలో, ఓటీటీ లలో వీక్షించే వారి సంఖ్య మాత్రమే రికార్డు స్థాయిలో పెరిగింది.
ఇప్పుడు క్రికెట్లో పాకిస్తాన్ కంటే కూడా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే పోరును వీక్షించే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. పైగా ఈ రెండు జట్లు సమవుజ్జీలు కావడంతో పోటీ హోరాహోరీగా సాగుతూ ఉంటుంది. ఇటీవలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని ఆస్ట్రేలియా గెలిచినప్పటికీ.. టీమిండియా తన వంతు పోటీని ఇచ్చింది. అంతకుముందు జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియా, భారత్ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాలో 3 వన్డేల సిరీస్, రెండు టి20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. ఇందులో భాగంగానే ఈ సిరీస్ ను విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. ఇందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని వినియోగించుకుంటున్నది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. పొట్టి ఫార్మాట్ నుంచి కూడా దూరం జరిగారు. పరిమిత ఓవర్లలోనే వారిద్దరు ఆడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్లో వారిద్దరు ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ స్పోర్ట్స్ రోహిత్, విరాట్ కోహ్లీని విపరీతంగా వాడుకుంటుంది. వారిద్దరూ ఈసారి కంగారు జట్టు పని పడతారని చెబుతోంది.. విరాట్, రోహిత్ ను ప్రధానంగా చూపిస్తూ ఓ యాడ్ కూడా రూపొందించింది. ఆ యాడ్ ప్రస్తుతం అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.. అన్నట్టు టీమ్ ఇండియా సారథి గిల్ ను స్టార్ స్పోర్ట్స్ పట్టించుకోకపోవడం విశేషం.
స్టార్ స్పోర్ట్స్ కేవలం విరాట్, రోహిత్ శర్మను మాత్రమే లెక్కలోకి తీసుకోవడం పట్ల గిల్ అభిమానులు మండిపడుతున్నారు. జట్లు నడిపించే సారధిని పక్కనపెట్టి వారిద్దరికీ మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం ఏమిటని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రచారం కోసం ఈ స్థాయికి దిగజారుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం తాను చేస్తున్న పనిని సమర్థించుకోవడం ఇక్కడ గమనార్హం.
RO-KO are back and they mean business in Australia!
Will the iconic duo light it up against their toughest rivals? #AUSvIND Starts OCT 19 pic.twitter.com/PoxnLjjZDv
— Star Sports (@StarSportsIndia) October 7, 2025