IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions trophy 2025) లో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత్ (IND vs AUS) తలపడుతున్నాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసింది. 264 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత 265 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఈ కథనం రాసే సమయానికి 22.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (40), శ్రేయస్ అయ్యర్(39) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 143 పరుగుల దూరంలో ఉంది. అయ్యర్, విరాట్ రెండో వికెట్ కు ఇప్పటి వరకు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(28) వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. 29 బంతులు ఎదుర్కొన్న అతడు మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 28 పరుగులు చేశాడు. కూపర్ కన్నోల్లీ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే రోహిత్ శర్మ ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా అతడు 5.6 ఓవర్లో నాథన్ ఎల్లీస్ బౌలింగ్ లో కొట్టిన ఫోర్ ఈ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచాడు.. ఎల్లీస్ బౌలింగ్ లో అతడు ముందుకు వచ్చి షాట్ కొట్టగా అది దూసుకు వచ్చింది.. అదే సమయంలో అక్కడే ఉన్న ఎంపైర్ క్రిస్ గఫేనే ఒక్కసారిగా కిందికి వంగాడు. దీంతో ఆ బంతి తగులుతుందేమోనని భయంతో ఎంపైర్ క్రిస్ గఫేనే వణికి పోయాడు. ఇదే విషయాన్ని రోహిత్ శర్మతో క్రిస్ గఫేనే చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Also Read : రెండుసార్లు తప్పించుకున్నాడు.. చివరికి వరుణ్ చక్రవర్తి “హెడ్” ఏక్ తొలగించాడు.. ఏకంగా నేషనల్ హీరో అయిపోయాడు.
సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు
టీమిండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కు ముందు.. కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ” టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లావుగా ఉంటాడు. కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని లాగా అతడు ఫిట్ గా ఉండడు. పైగా అతడు వేగంగా వికెట్ల మధ్య పరుగులు తీయలేడని” షామా మహమ్మద్ వ్యాఖ్యానించింది. ఆమె రోహిత్ శర్మపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో నిన్న మొత్తం పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ట్విట్టర్ లో అయితే కాంగ్రెస్ కా బాప్ రోహిత్ అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. దాదాపు 80,000 పైచిలుకు ట్వీట్లు పడ్డాయి. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ కొట్టిన ఫోర్ ను ఉద్దేశించి నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ” రోహిత్ భయ్యా కొంచెం కోపం తగ్గించుకో.. అక్కడ ఉన్నది ఫీల్డ్ ఎంపైర్..షామా మహమ్మద్ కాదు.. క్రిస్ గఫానే.. దెబ్బకు భయంతో వణికి పోయాడని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read : ఆస్ట్రేలియా దిగ్గజం పాంటింగ్ రికార్డు బద్దలు. సరికొత్త ఘనత సృష్టించిన విరాట్ కోహ్లీ..
Rohit bro.. chill, that’s the Umpire, not Shama Mohamed #INDvsAUS pic.twitter.com/fdhWGHwdtg
— Shilpa (@shilpa_cn) March 4, 2025