https://oktelugu.com/

IND Vs AUS: ఆడుతోంది ఆస్ట్రేలియానేనా ? ఇలాంటి వ్యూహాలతో భారత్ ను ఎలా కట్టడి చేస్తారు?

"ఆడుతోంది ఆస్ట్రేలియా నేనా.. ఇలాంటి వ్యూహాలతో భారత్ ను ఎలా కట్టడి చేస్తారు? వారు 150 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకుంటున్నారు. ఏకంగా రెండవ ఇన్నింగ్స్ లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేశారు.. ఆస్ట్రేలియా బౌలర్లు మాత్రం వారిని అవుట్ చేయకుండా వినోదం చూస్తున్నారని" ఆస్ట్రేలియా లెజెండ్ క్రికెటర్ ఆడం గిల్ క్రిస్ట్ మండిపడ్డాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 25, 2024 / 09:52 AM IST

    IND Vs AUS(4)

    Follow us on

    IND Vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్లు పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ఆడుతున్నాయి. ఈ టెస్ట్ లో భారత్ ఆస్ట్రేలియా పై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకు కుప్పకూలింది. అయితే ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. తద్వారా 46 పరుగుల లీడ్ సంపాదించింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ వికెట్లు కోల్పోయి 487 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. టీమిండి ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 161, విరాట్ కోహ్లీ 100* పరుగులతో ఆకట్టుకున్నారు. వీరి మార్క్ సెంచరీల ద్వారా భారత జట్టు మొత్తంగా 533 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎదుట ఉంచింది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా జట్టు టెస్ట్ క్రికెట్లో ఇంత దారుణంగా ఆడటం, అది కూడా స్వదేశంలో ఆడటం ఇదే తొలిసారి.

    మండిపడ్డ గిల్ క్రిస్ట్

    ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రదర్శన చూసి ఆ జట్టు లెజెండరీ ఆటగాడు గిల్ క్రిస్ట్ మండిపడ్డాడు. ఆడుతోంది ఆస్ట్రేలియా జట్టేనా అనే అనుమానం కలుగుతోందని అతడు పేర్కొన్నాడు..” ఆటగాళ్లకు వ్యూహాలు లేవు. సరైన విధానాలు లేవు. ఎందుకు ఆడుతున్నారో అర్థం కావడం లేదు.. ప్రత్యర్థి జట్టు బౌలర్లు కేవలం ఐదుగురు మాత్రమే బౌలింగ్ చేస్తున్నారు. ఆ జట్టు కెప్టెన్ వికెట్ల మీద వికెట్లు పడగొడుతున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కానీ ఇదే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆ స్థాయిలో ప్రతిభ చూపించలేకపోతున్నాడు. బ్యాటర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. ఫీల్డర్లు వినోదం చూస్తున్నారు. ఇలాంటి ఆట ఎందుకు ఆడుతున్నారు? స్వదేశంలో ఆడుతున్నప్పటికీ ఇంతలా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అసలు ఆస్ట్రేలియా జట్టు ఇలాంటి ఆట ఆడుతుందని ఎవరైనా ఊహించారా? ఇంతటి దుస్థితి వస్తుందని గ్రహించారా? కొంచమైనా నిగ్రహంతో ఆడక పోతే ఎలా? ఎలాంటి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోకుండా ఎందుకు ఆడుతున్నారంటూ” గిల్ క్రిస్ట్ మండిపడ్డాడు..

    అయితే గిల్ క్రిస్ట్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు కూడా ఏకీభవిస్తున్నారు. ” ఆస్ట్రేలియా జట్టు పని అయిపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు సత్తా చాటలేకపోతున్నారు. గత రెండు సీజన్లో భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫిని దక్కించుకుంది. ఈసారి కూడా అదే స్థాయిలో ప్రదర్శన చేసేలా ఉందని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. “జట్టు ఆటగాళ్లలో సమష్ఠితత్వం లేకుండా పోయింది. పోరాడే స్ఫూర్తి తగ్గిపోయింది. స్థిరమైన ఇన్నింగ్స్ ఆడాలనే సోయి లేకుండా పోయింది. ఇలాంటి ఆటగాళ్లతో భారత్ ను ఆస్ట్రేలియా ఎలా ఓడిస్తుంది? ఇలాంటి జట్టును ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ ఎలా ఎంపిక చేసిందని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.