https://oktelugu.com/

Roja : నటి రోజా ఒడిలో పెరిగిన పాన్ ఇండియా స్టార్ ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు

మాజీ మంత్రి, నటి రోజాకు ఓ పాన్ ఇండియా స్టార్ తో చాలా కాలంగా అనుబంధం ఉందట. సదరు హీరోని ఆమె ఎత్తుకుని ఆడించారట. తరచుగా కలిసేవారట.

Written By: , Updated On : November 25, 2024 / 09:37 AM IST
Do you know who is the Pan India star who grew up in the lap of actress Roja? Can't really imagine

Do you know who is the Pan India star who grew up in the lap of actress Roja? Can't really imagine

Follow us on

Roja : మాజీ మంత్రి, నటి రోజాకు ఓ పాన్ ఇండియా స్టార్ తో చాలా కాలంగా అనుబంధం ఉందట. సదరు హీరోని ఆమె ఎత్తుకుని ఆడించారట. తరచుగా కలిసేవారట. ఇంతకీ ఎవరా పాన్ ఇండియా స్టార్? రోజాతో అనుభవం ఎలా కుదిరింది? ఇంట్రెస్టింగ్ స్టోరీ

రోజా సీనియర్ హీరోయిన్స్ లో ఒకరు. 90లలో ఆమె స్టార్ గా సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటింది. తెలుగు, తమిళ్ భాషల్లో రోజా అధికంగా చిత్రాలు చేసింది. ఇతర భాషల్లో కూడా ఆమె రాణించారు. దర్శకుడు సెల్వమణిని రోజా ప్రేమ వివాహం చేసుకుంది. ఆయన దర్శకత్వంలో అనేక హిట్ చిత్రాల్లో రోజా నటించారు. రోజాకు ఇద్దరు సంతానం. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. స్టార్డం పోయాక రోజా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. గోలీమార్, మొగుడు, శంభో శివ శంభో వంటి చిత్రాల్లో పవర్ఫుల్ రోల్స్ చేసింది.

రాజకీయాల్లో కూడా ఆమె సక్సెస్. గత ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రోజా ఓడిపోయింది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో రోజా తిరిగి సినిమాలు చేస్తారని, జబర్దస్త్ జడ్జిగా రీ ఎంట్రీ ఇస్తారంటూ పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. రోజాకు అత్యంత ఆప్తుడు అయిన రాకింగ్ రాకేష్ నటించిన కేసీఆర్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు రోజా హాజరయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆమె ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

ఓ ఇంటర్వ్యూలో రోజా పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు. సినిమాలు చేసే ఆసక్తి ఉంది. మా అబ్బాయికి కూడా నేను సినిమాలు చేయడం ఇష్టమే అన్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. బాల్యంలో రామ్ చరణ్ ని నేను ఎత్తుకొని ఆడించాను. ముఠామేస్త్రి మూవీ షూటింగ్ ఊటీలో జరగ్గా అక్కడకు రామ్ చరణ్ వచ్చాడు. సెట్స్ లో బాగా అల్లరి చేసేవాడు. అసలు పట్టుకోలేకపోయేవాళ్ళం. స్కూల్ లో జాయిన్ అయ్యాక అల్లరి తగ్గింది..

ఆ పిల్లాడు ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే గర్వంగా ఉంది. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఇంట్రో సీన్ లో జనాల్లోకి దూకి ఫైట్ చేయడం నాకు బాగా నచ్చింది. రామ్ చరణ్ డాన్స్ చేస్తుంటే చిరంజీవి గుర్తుకు వస్తాడు. బాల్యం నుండే వాళ్ళ నాన్న పాటలకు చరణ్ డాన్సులు చేస్తూ ఉండేవాడు… అని రోజా అన్నారు. రోజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రాజకీయంగా విబేధాలు ఉన్నప్పటికీ చిరంజీవి అంటే రోజాకు అభిమానం. రోజా-చిరంజీవి కాంబినేషన్ లో ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు వంటి హిట్ చిత్రాలు వచ్చాయి.