https://oktelugu.com/

Nitish Kumar Reddy: ఇంట విజయం సాధించి.. రచ్చ గెలిచి చూపించాడు.. దటీజ్ నితీష్ కుమార్ రెడ్డి..

మన పెద్దవాళ్లు ఇంట గెలిచి.. రచ్చ గెలవాలి అంటారు.. దాని వెనక లోతైన అంతరార్థం ఉంది. దాని అర్థం చేసుకున్నాడు కాబట్టే.. నితీష్ కుమార్ రెడ్డి బాధ్యతాయుతమైన క్రికెట్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడ్డాడు. నాకేంటి అనుకోకుండా.. నేనేంటి అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. బలమైన ఇన్నింగ్స్ ఆడి.. జట్టును నిలబెట్టాడు.. తను కూడా నిలబడ్డాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 28, 2024 / 02:04 PM IST

    Nitish Kumar Reddy

    Follow us on

    Nitish Kumar Reddy: సోషల్ మీడియా నుంచి మీడియా వరకు శనివారం నితీష్ కుమార్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది. మామూలుగా కాదు ట్విట్టర్లో అయితే అతడే ట్రెండింగ్లో ఉన్నాడు.. పాలిటిక్స్, స్పోర్ట్స్, సెలబ్రిటీ.. ఇలా అన్ని విభాగాలలో అతడే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల కాలంలో ఒక క్రికెటర్ ఈ స్థాయిలో ఘనతను సాధించలేదు. హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత పుష్ప మానరిజంతో అల్లు అర్జున్ అభిమానుల ప్రేమను సంపాదించుకున్నాడు. మెల్బోర్న్ మైదానంలో సెంచరీ చేసిన తర్వాత జెండా పాడినట్టుగా సంకేతం ఇచ్చి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల అభిమానాన్ని చురగొన్నాడు.. చివరికి ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు కూడా తన సెంచరీ కోసం ప్రార్థనలు చేసే విధంగా బ్యాటింగ్ చేశాడు. అందువల్లే నితీష్ కుమార్ రెడ్డి అందరి హృదయాలలో స్థానం సంపాదించుకున్నాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి ఈ స్థాయి దాకా చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆర్థికంగా పల్లాలను కూడా చూశాడు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. తాను నిర్దేశించుకున్న వదిలిపెట్టలేదు. అందువల్లే అతడు ఈ స్థాయికి ఎదిగాడు.

    రంజీ లో..

    టీమిండియాలో స్థానం సంపాదించడం కంటే ముందు రంజీలో తన ప్రతాపాన్ని చూపించాడు. దేశవాళి క్రికెట్లో ఆంధ్ర జట్టు తరఫున ఆడాడు. ఆల్ రౌండర్ గా అండర్ 19 బి టీంకు ప్రాతినిధ్యం వహించాడు. 17 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడాడు. అందులో 566 పరుగులు చేశాడు. ఇక రంజీలలో ఆంధ్ర జట్టు తరఫున ఏడు మ్యాచులు ఆడాడు. వేగంగా 366 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. తన ఆల్ రౌండర్ ప్రదర్శన ద్వారా ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ అభిమానాన్ని చురగొన్నాడు. దీంతో వారు అతడిని వేలంలో 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేశారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నితీష్ కుమార్ రెడ్డి ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఇదే క్రమంలో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఏకంగా సెంచరీ చేసి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి… సూపర్ సెంచరీ చేసి.. ఒకప్పటి లెజెండరీ క్రికెటర్ అనిల్ కుంబ్లే(87) పేరు మీద ఉన్న రికార్డును బాధలు కొట్టాడు. మొత్తంగా ఎనిమిదో నెంబర్ లో బ్యాటింగ్ కు దిగి సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా ఘనతను అందుకున్నాడు. రంజి క్రికెట్లో నేర్చుకున్న నేర్పును.. సాధించిన ఓర్పును టెస్ట్ క్రికెట్లో అమలులో పెట్టడం మొదలుపెట్టాడు. అందువల్లే నితీష్ కుమార్ రెడ్డి ఈ స్థాయిలో విజయం సాధించగలిగాడు. ఆస్ట్రేలియా బౌలర్ల పై అధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే.. తన బ్యాటింగ్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. అందువల్లే సెంచరీ చేసి టీమ్ ఇండియాకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు.