https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా..? ఇప్పుడు ఎంత హాట్ హీరోయిన్ అయ్యిందో చూస్తే ఆశ్చర్యపోతారు!

బాల నటులుగా మన తెలుగు ఆడియన్స్ ని అలరించిన ఎంతో మంది నేడు ఊహించని రేంజ్ కి చేరుకోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం.

Written By:
  • Vicky
  • , Updated On : December 28, 2024 / 02:07 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu : బాల నటులుగా మన తెలుగు ఆడియన్స్ ని అలరించిన ఎంతో మంది నేడు ఊహించని రేంజ్ కి చేరుకోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అమ్మాయిలు అయితే అతి తక్కువ సమయంలోనే గుర్తు పట్టలేని రేంజ్ లో మారిపోతున్నారు. మొన్ననే కదా ఈ అమ్మాయి ని బాలనటిగా చూసాము, ఇంతలోపే ఈ రేంజ్ కి వచ్చేసిందా అని మనం ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి అమ్మాయి ఇప్పుడు మీరు ఫోటోలో చూసిన అమ్మాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నిల్చొని ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్ర పోషించే రేంజ్ కి ఎదిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఈ అమ్మాయి కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇంస్టాగ్రామ్ లో ఈమె అప్లోడ్ చేసే ఫోటోలకు, వీడియోలకు వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు రమ్య పసుపులేటి.

    బాల్యం లో ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ‘పంచాక్షరీ’ చిత్రం లో ఈమె చిన్నప్పటి అనుష్క క్యారక్టర్ ని చేసింది. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ చిత్రంలో కూడా ఈమె నటించింది. అదే విధంగా తమిళం లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో బాలనటిగా నటించిన ఈ చిన్నారి, ఆ తర్వాత సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చి చదువు మీద ద్రుష్టి పెట్టింది. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఈమె మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టి మంచి ఫ్యాషన్ బ్లాగర్ గా పేరు తెచ్చుకుంది. అలా మోడలింగ్ లో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె తొలిసారి హీరోయిన్ గా ‘హుషారు’ అనే చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది.

    ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి తో కలిసి ఈమె BFF అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇక రీసెంట్ గా రావు రమేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ అనే చిత్రం లో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఆమె ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న విశ్వంభర చిత్రం లో చిరంజీవి కి చెల్లి పాత్రలో కనిపించబోతుంది. ఈ క్యారక్టర్ సినిమాకి ఎంతో కీలకం. ఒక విధంగా చెప్పాలంటే ఈ క్యారక్టర్ చుట్టూనే మూవీ స్టోరీ తిరుగుతుందట. కెరీర్ లో మంచి రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఈ సినిమాతో వచ్చేసింది. మరి భవిష్యత్తులో ఈ అచ్చ తెలుగు అమ్మాయి టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది చూడాలి.