Ind Vs Aus 3rd T20: టీమిండియా బికేటి సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా తో మూడో టి20 ఆడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్లలో టీమిండియా టాస్ ఓడిపోయింది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్ లో ఆటగాళ్ల నిర్లక్ష్యం వల్ల ఓటమి తప్పలేదు. కానీ మూడో మ్యాచ్లో మాత్రం టీమిండియా విభిన్నంగా వ్యవహరించింది. పిచ్ పరిస్థితి ని అంచనా వేసి.. టాస్ గెలిచిన వెంటనే టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరో మాటకు తావులేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు.
గత రెండు మ్యాచ్లలో గౌతమ్ గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా కు చోటు కల్పించారు. అయితే అతడు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా రెండవ టి20 లో బ్యాటింగ్ పరంగా అతడు అదరగొట్టినప్పటికీ.. బౌలింగ్ పరంగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి పట్ల చాలామంది సీనియర్ ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు కూర్పు విషయంలో గౌతమ్ గంభీర్ అనవసరమైన ప్రయోగాలు చేస్తున్నాడని మండిపడ్డారు. దీంతో మూడో టి20 మ్యాచ్ కు గౌతమ్ గంభీర్ తన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఈసారి తన శిష్యుడిని పక్కనపెట్టి.. సింగ్ కు అవకాశం ఇచ్చాడు. అది ఎంత విలువైన నిర్ణయమో అర్థమైంది.
రెండో టి20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు హెడ్. అయితే అతడికి దిమ్మతిరిగే స్ట్రోక్ ఇచ్చాడు సింగ్.. తను వేసిన తొలి ఓవర్ నాలుగో బతికే హెడ్ ను ఔట్ చేశాడు సింగ్. సింగ్ వేసిన బంతిని అంచనా వేయడంలో హెడ్ విఫలమయ్యాడు. బౌండరీ కొట్టి ఉత్సాహంతో ఉన్న అతడు.. అదే తీరుగా షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ అంచుకు తగిలి గాలిలో లేచింది. దానిని సూర్య కుమార్ యాదవ్ అత్యంత తెలివిగా అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఆరు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇక ఇదే క్రమంలో జోస్ ఇంగ్లిస్ ను కూడా సింగ్ ఔట్ చేశాడు. పదునైన బంతిని వేసి అతడిని బోల్తా కొట్టించాడు. దీంతో ఒక పరుగు మాత్రమే చేసిన అతడు అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫలితంగా 14 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి టి20 మ్యాచ్లలో అగ్రెసివ్, తెలివిగా బౌలింగ్ చేసే వారికి వికెట్లు దక్కుతుంటాయి. రెండో టి20 మ్యాచ్లో టీమిండియా నుంచి కరువైంది ఇదే. పైగా బుమ్రా దారుణంగా బౌలింగ్ వేశాడు. ఘోరంగా పరుగులు ఇచ్చాడు. అందువల్లే ఆస్ట్రేలియా బ్యాటర్లు పండగ చేసుకున్నారు. అయితే మూడో టి20 లో కూడా అతడు బౌలింగ్ వేసే విధానం పెద్దగా మారలేదు. ఓవైపు సింగ్ వికెట్లు పడగొడుతుంటే.. అతడు మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఇదే తీరుగా బౌలింగ్ వేస్తే నాలుగో మ్యాచ్ వరకు అతడికి మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఈ మ్యాచ్లో ఈ కథనం రాసే సమయం వరకు ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ (38), మార్ష్(12) క్రీజ్ లో ఉన్నారు.