Renu Desai Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్…ఈయన చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.రీసెంట్ గా ‘ఓజీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన తన తదుపరి సినిమా విషయాల్లో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే ఇటు సినిమాలను చేస్తున్న పవన్ కళ్యాణ్ తొందర్లోనే మరికొన్ని సినిమాలకు కమిట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపాయి.
తద్వారా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. తన అభిమానులు తన నుంచి ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలు మాత్రం వదలడం లేదు… ఇక పవన్ కళ్యాణ్ కెరియర్లో మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. రేణు దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ అఖిరా నందన్, ఆధ్యాలు పుట్టారు.
వీళ్లు చాలా సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉన్నప్పటికి అనుకోని కారణాలవల్ల వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. ఇక దానికి భరణంగా పవన్ కళ్యాణ్ చాలా పెద్ద మొత్తంలోనే అమౌంట్ చెల్లించాడు. అయినప్పటికి తన పిల్లలను పెంచడానికి వల్ల ఆలనా పాలనా చూసుకోవడానికి సంవత్సరం వాళ్లకు 10 కోట్ల రూపాయలను పవన్ కళ్యాణ్ చెల్లిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి…
పిల్లలతో పాటు రేణు దేశాయ్ ను వదిలేసినందుకు గాను పవన్ కళ్యాణ్ అంత మొత్తంలో అమౌంట్ చెల్లిస్తున్నాడట…ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కాంట్రవర్సీలు లేనప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే ఒక విమర్శను మాత్రం ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు లేవనెత్తుతూ ఉంటాయి. దీనికి పవన్ కళ్యాణ్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికి వాళ్ళు మాత్రం మారడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్స్ లో స్టేట్ పాలిటిక్స్ లోనే కాకుండా నేషనల్ పాలిటిక్స్ లో కూడా చక్రం తిప్పిన విషయం మనకు తెలిసిందే…