Rohit Sharma Virat Kohli: వారిద్దరికీ ఫామ్ తో సంబంధం ఉండదు. మైదానంతో సంబంధం ఉండదు. బౌలర్లతో సంబంధం ఉండదు. వచ్చారా.. బ్యాట్ పట్టుకున్నారా.. పరుగులు రావాల్సిందే. ఎంతటి కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. వారు తమ దూకుడు ఆపరు. కొన్ని సందర్భాలలో వెనక్కి తగ్గుతారు గాని.. తలవంచే పరిస్థితి లేదు. అందువల్లే వారిని ఈ కాలపు యోధులు అని పిలుస్తుంటారు. టీమిండియాలో వారు సృష్టించిన రికార్డులు మామూలువి కావు. దశాబ్దాలుగా టీమిండియా క్రికెట్ మొత్తాన్ని వారిద్దరు శాసిస్తున్నారు. వారిద్దరే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.
ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో విరాట్ తొలి రెండు మ్యాచ్లలో విఫలమయ్యాడు. రోహిత్ తొలి వన్డేలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఆ తర్వాత తన ఫామ్ లోకి వచ్చేసాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేశాడు. మూడో వన్డేలో ఏకంగా సెంచరీ చేశాడు. తనకెంతో ఇష్టమైన విరాట్ తో కలిసి రెండో వికెట్ కు సూపర్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆస్ట్రేలియా జట్టు విధించిన లక్ష్యాన్ని ఫినిష్ చేయడంలో తనదైన దూకుడు ప్రదర్శించాడు. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో చూపించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ కు అవకాశం దొరకదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ దుమ్మురేపాడు. తొలి రెండు వన్డేలలో విఫలమైన విరాట్ కోహ్లీ.. మూడే వన్డే లో టచ్ లోకి వచ్చేసాడు. తనకెంతో ఇష్టమైన సిడ్నీ వేదికగా అదరగొట్టాడు. పరుగుల వరద పారించాడు.
మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు విధించిన 236 పరుగుల టార్గెట్ ను ఫినిష్ చేయడంలో రోహిత్, విరాట్ దూకుడు కొనసాగించారు. వీరిద్దరూ ఏకంగా రెండో వికెట్ కు 133* పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తద్వారా ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారు.. వాస్తవానికి వీరిద్దరిది విజయవంతమైన జోడి అయినప్పటికీ.. గడచిన ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నమోదు కాలేదు. అయితే ఇన్ని సంవత్సరాల నిరీక్షణకు వీరిద్దరూ తెరదించారు. అచ్చి వచ్చిన మైదానంపై పరుగుల వరద పారిస్తూ.. ఆస్ట్రేలియా బౌలర్లకు సింహ స్వప్నం లాగా నిలిచారు. తద్వారా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఊహించని రికార్డును సొంతం చేసుకుని అదరగొట్టారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోడి దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే మైదానం మొత్తం వీరిద్దరి నామస్మరణతో ఊగిపోయింది. చాలా కాలం తర్వాత వీరిద్దరూ తమదైన శైలిలో బ్యాటింగ్ చేస్తున్నాడు అభిమానులను సమ్మోహితులను చేసింది. వాస్తవానికి ఆడుతోంది ఆస్ట్రేలియాలో అయినప్పటికీ.. ఇండియాలో మ్యాచ్ జరుగుతోందా అనే భ్రమను కల్పించింది.
THE ICONIC MOMENT FINALLY HERE.
– First hundred partnership between Virat Kohli and Rohit Sharma in 5 years and 9 months. pic.twitter.com/1djnFvxKXW
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 25, 2025