Ramya Moksha Eliminated: ఈ వారం బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ నుండి టైఫాయిడ్ కారణంగా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ అయేషా శనివారం ఎపిసోడ్ కి ముందే ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ కావడంతో ఈ వారం మరో ఎలిమినేషన్ ఉండదని అంతా అనుకున్నారు. కానీ కాసేపటి క్రితమే అలేఖ్య చిట్టీ పికిల్స్ రమ్య ఎలిమినేట్ అయ్యినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. శని,ఆదివారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ ని శనివారం రోజునే షూటింగ్ చేస్తారు అనే విషయం తెలిసిందే. రమ్య మోక్ష ఎలిమినేషన్ పూర్తి అయ్యి, ప్రస్తుతం బజ్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట. హౌస్ లోకి రమ్య ఫైర్ స్ట్రోమ్ లాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టింది. ఫిజికల్ టాస్కుల్లో ఈమె మగవాళ్ళతో సమానంగా ఆడగలదు. గత వారం ఎపిసోడ్ లో ఆమె ఏకంగా భరణి ని సైతం ఈడ్చుకొని వెళ్లి పక్కకు పడేసింది.
కానీ నోరు మంచిది అయితే, ఊరు మంచిది అవుతుందని అంటుంటారు. ఏ నోటి దూల వల్ల అయితే ఆమె సోషల్ మీడియా లో విపరీతమైన నెగిటివిటీ ని తెచ్చుకుందో, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత కూడా అదే నోటి దూల ని కొనసాగించింది. ఆమె హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్, తనూజ రిలేషన్ పై చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. ఆ వారం ఈమె నామినేషన్స్ లోకి రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చి ఉండుంటే ఆ వారమే ఈమెని బయటకు నెట్టేసేవారు ఆడియన్స్. ఇక ఈ వారం ఆమె నామినేషన్స్ సమస్యం లో తనూజ పై ఒక రేంజ్ లో నోరు పారేసుకుంది. ఎపిసోడ్ లో చాలా వరకు ఎడిటింగ్ లో కట్ చేసేసారు కానీ, లైవ్ లో ఆమె మాటలను చూస్తే ఎవరికైనా కోపం రాక తప్పదు.
వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా వచ్చిన అమ్మాయి, హౌస్ లో కంటెస్టెంట్స్ గ్రాఫ్ ఎలా ఉందో సోషల్ మీడియా లో కళ్లారా చూసొచ్చిన అమ్మాయి, తనూజ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కూడా తెలుసు, అయినప్పటికీ కూడా ఆమెని ఆ రేంజ్ టార్గెట్ చేయడం లో ఈ రమ్య స్ట్రాటజీ ఏంటో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. తనూజ ని టార్గెట్ చేయడం వల్లే, ఆమె అభిమానులు ఈమెను టార్గెట్ చేసి మరీ బయటకు పంపేశారని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈమె సెలబ్రిటీల క్యాటగిరీ లోనే హౌస్ లోకి వచ్చింది కాబట్టి ఆమెకు రెండు వారాలకు కలిపి 3 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.