Rohit Sharma century: టీమిడియాకు టి20 వరల్డ్ కప్ అందించాడు.. ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. ఆ మాత్రం గౌరవం కూడా లేకుండా ఇంగ్లాండ్ సిరీస్ ముందు టీమిండియా మేనేజ్మెంట్ రోహిత్ శర్మ ను సారధి స్థానం నుంచి పక్కన పెట్టింది. ఆస్థానంలో గిల్ కు అవకాశం కల్పించింది. కానీ అతడేమో విఫల సారధిగా తొలి సిరీస్ లోనే చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో గిల్ విఫలమయ్యాడు. బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోయాడు. సారధిగా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. దీంతో గౌతమ్ గంభీర్ మీద విమర్శలు పెరిగిపోయాయి. అనవసరంగా రోహిత్ శర్మ ను సారథి స్థానం నుంచి తొలగించారని ఆరోపణలు వినిపించాయి.
ఆ ఆరోపణలకు బలం చేకూర్చుతూ రోహిత్ శర్మ అదరగొట్టాడు. రెండవ వన్డేలో సూపర్ హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. మూడో వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ కథనం రాసే సమయం వరకు రోహిత్ 103* పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీతో కలిసి అతడు రెండో వికెట్ కు అజేయంగా 144 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ శర్మ ను టెస్ట్ జట్టు నుంచి సారధిగా తొలగించిన తర్వాత.. అతడు ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. అంతేకాదు వన్డే ఫార్మాట్ నుంచి కూడా అతడిని సారధిగా తొలగించడంతో. సాధారణ ఆటగాడిగానే మిగిలిపోయాడు. అయినప్పటికీ రోహిత్ ఏమాత్రం బాధపడలేదు. పైగా తన జట్టు కోసం అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. తొలి రెండు వన్డేలలో గిల్ విఫలమైనప్పటికీ.. రోహిత్ రెండవ వన్డేలో ఫామ్ లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ చేశాడు. ఇక మూడో వన్డేలో అయితే ఏకంగా సెంచరీ చేసి అదరగొట్టాడు.
వాస్తవానికి రోహిత్ గతంలో కాస్త బరువుతో ఉండేవాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగుపెట్టే విషయంలో ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో అతని బరువు గురించి అనేక విమర్శలు వచ్చాయి. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ తో ఓ సందర్భంలో తన బరువు గురించి రోహిత్ చర్చించాడు. అదే సమయంలో ఇద్దరు మధ్య వచ్చిన ఆలోచనను సీరియస్ గా తీసుకున్నాడు రోహిత్. రోజులో చాలాసేపు జిమ్ లో గడిపేవాడు. ఫుడ్ మెనూ మొత్తం పూర్తిగా మార్చేసుకున్నాడు. శరీర సామర్థ్యంపై దృష్టి పెట్టాడు. తద్వారా అదనపు బరువును పూర్తిగా తగ్గించుకున్నాడు. ప్రస్తుతం అతడు నాజుగా కనిపిస్తున్నాడు. అతడు బరువు తగ్గడం ఎంతగానో కలిసి వచ్చింది. ఫలితంగా ఆస్ట్రేలియా సిరీస్లో అతడు వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. అభిషేక్ తో మొదటి నుంచి కూడా రోహిత్ కు స్నేహం ఉంది. బరువు తగ్గించుకునే విషయంతో పాటు.. బ్యాటింగ్.. ఇతర అంశాల మీద రోహిత్ దృష్టిపెట్టాడు. అభిషేక్ ఆధ్వర్యంలోనే ప్రాక్టీస్ చేశాడు. అతడిని వ్యక్తిగత శిక్షకుడిగా నియమించుకొని ముంబైలో ఆస్ట్రేలియా సిరీస్ కు ముందు విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు రోహిత్. చివరికి అతడు కొట్టిన బంతి వేగంగా దూసుకుపోయి లంబోర్గిని కారును బద్దలు కొట్టింది. ఆ కారు కూడా రోహిత్ శర్మది కావడం విశేషం.
ఆస్ట్రేలియా సిరీస్ లో ఇటీవల అతడు చేసిన హాఫ్ సెంచరీ, ఇప్పటి సెంచరీ దానికి బలమైన ఉదాహరణలు. ఇలా చెప్పుకుంటూ పోతే రోహిత్ ఇన్నింగ్స్ ఒక వర్ణనకు అందదు. 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఉంటాడా.. అని ఇటీవల అజిత్ అగర్కర్ అనుమానం వ్యక్తం చేశాడు. కానీ ఇంతటి బ్యాటింగ్ చూసిన తర్వాత కూడా అతని ఎంపిక చేయకపోతే.. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో అజిత్ అగర్కర్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
…….
Take a bow, Rohit Sharma! ♂
ODI century no. 3️⃣3️⃣ for the #TeamIndia opener
Updates ▶ https://t.co/omEdJjQOBf#AUSvIND | @ImRo45 pic.twitter.com/vTrIwKzUDO
— BCCI (@BCCI) October 25, 2025