Ind Vs Aus 2nd Test: జట్టు అవసరాల దృష్ట్యా కొన్నిసార్లు SENA(South Africa, England, New Zealand, Australia) దేశాలపై ఒంటరిగా స్పిన్ బౌలర్ గా బరిలోకి దిగాడు. దిగ్గజ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. బంతి మాత్రమే కాదు బ్యాట్ తోనూ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. ఇటీవల బంగ్లాదేశ్ పై అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. రవిచంద్రన్ అశ్విన్ తో కలిసి చెన్నై వేదికగా జరిగిన టెస్టులో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో మెరుగ్గానే ఆడినప్పటికీ తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడికి అవకాశం లభించింది. వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్ సిరీస్ లో అదరగొట్టడంతో అతడికి పెర్త్ టెస్ట్ లో ప్లేయింగ్ -11 లో అవకాశం లభించింది. దీంతో రవీంద్ర జడేజా రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి వచ్చింది. అయితే రెండో టెస్ట్ లోనూ రవీంద్ర జడేజా ఆడే అవకాశం ఉండదని తెలుస్తోంది..
ఎందుకు దూరమంటే..
మొదటి టెస్టులో ఏకైక స్పిన్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ తో భారతరంగంలోకి దిగింది. ఆస్ట్రేలియా లో ఏడుగురు బ్యాటర్లు ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లు కావడంతో వాషింగ్టన్ సుందర్ కు బీసీసీఐ మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. దీంతో రవీంద్ర జడేజా రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి వచ్చింది. మరోవైపు తొలి టెస్ట్ కు రవిచంద్రన్ అశ్విన్ కూడా దూరంగా ఉన్నాడు. అయితే రెండవ టెస్టులో వీరిద్దరికి ప్లే -11 లో ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఇటీవల సుందర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ జట్టుపై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో అద్భుతంగా భోజనం చేశాడు. ఇక మొదటి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో సుందర్ జట్టుకు అవసరమైన 29 పరుగులు చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జడేజా 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ” వాషింగ్టన్ సుందర్ భిన్నమైన విధంగా బౌలింగ్ చేస్తాడు. రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఏడుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లతో రంగంలోకి దిగుతోంది. పైగా ఇది పింక్ బాల్ టెస్ట్. రవీంద్ర జడేజా, అశ్విన్ బౌలింగ్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సుపరిచితమే. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ను ఇంతవరకు వారు ఎదుర్కోలేదు. ప్రాక్టీస్ మ్యాచ్ లో సుందర్ బౌలింగ్లో వారు ఇబ్బంది పడ్డారు. దీనిని జట్టు మేనేజ్మెంట్ గుర్తించింది. అందువల్లే రెండో టెస్ట్ లోనూ అతడికి అవకాశం కల్పిస్తోంది. అడిలైడ్ టెస్టులో భారత్ గనుక మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తే.. వాషింగ్టన్ సుందర్ భవితవ్యానికి డోకా ఉండకపోవచ్చని” జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.