IND vs AFG : ఆఫ్గాన్ తో ఆడే మొదటి టి 20 మ్యాచ్ కి కోహ్లీ దూరం.. కారణం ఏంటంటే..?

అందుకే ఇండియన్ టీమ్ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందంటు పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు...

Written By: NARESH, Updated On : January 10, 2024 7:29 pm
Follow us on

IND vs AFG : ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తో ఆడే టి20 సిరీస్ కోసం బిసిసిఐ రీసెంట్ గా ఇండియన్ టీమ్ ని ప్రకటించింది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మొదటి టి20 మ్యాచ్ కి సీనియర్ ప్లేయర్ అయిన కింగ్ కోహ్లీ టీమ్ కి దూరం కానున్నట్టు గా కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలియజేశాడు.ఇక తన వ్యక్తిగత కారణాలవల్ల మొదటి టి20 మ్యాచ్ కి కోహ్లీ దూరం అవుతున్నట్టు గా ద్రావిడ్ తెలియజేశాడు.

అలాగే ఇండియన్ టీమ్ లో ఉన్న మరో ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్ పైన క్రమశిక్షణ పేరిట వస్తున్న న్యూస్ లు అన్నీ ఫేక్ అని తను విశ్రాంతి కోరడం తో ఆయనకి విశ్రాంతి ఇచ్చామని తెలియజేశాడు. అలాగే టీమ్ లో ఎక్కువమంది ప్లేయర్లు ఉండడం వల్లే కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లను పక్కన పెట్టినట్టుగా తను తెలియజేశాడు. ఇక రేపు ఆడబోయే టి20 మ్యాచ్ లో ఓపెనర్ గా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ వ్యవహరించనున్నారని తెలియజేశాడు…

ఇక ఆఫ్ఘనిస్తాన్ తో ఆడుతున్న ఈ టి20 సిరీస్ టి 20 వరల్డ్ కప్ కి ముందు ఇండియా ఆడబోయే చివరి టి20 సిరీస్ కావడం వల్ల ఈ సిరీస్ లో ప్లేయర్లు వాళ్ల సత్తా చాటుకొని టి 20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవడానికి చాలా ఆసక్తి ని చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మొదటి మ్యాచ్ లో కింగ్ కోహ్లీ దూరమవడం పట్ల అతని అభిమానులు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సంవత్సరం నుంచి కోహ్లీ టి 20 మ్యాచ్ లను ఆడటం లేదు ఇక ఇప్పుడు ఆడటానికి టీమ్ లోకి సెలెక్ట్ అయితే ఇప్పుడు కూడా మొదటి టి 20 మ్యాచ్ కి దూరం అవ్వడం పట్ల కోహ్లీ అభిమానులు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ టీం కి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహారించబోతున్నాడు. అలాగే రోహిత్ తో పాటు గా ఓపెనర్ ప్లేయర్ గా వచ్చి తన సత్తా చాటడానికి యశస్వి జైశ్వాల్ కూడా రెడీ అవుతున్నాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అఫ్గాన్ టీమ్ చాలా డేంజరెస్ టీమ్ అనే చెప్పాలి.వాళ్ళు పెద్ద పెద్ద టీమ్ లకి సైతం షాక్ ని ఇచ్చారు.అందుకే ఇండియన్ టీమ్ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందంటు పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…