India Vs England 2nd T20 Result: ఇంగ్లాండ్, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శనివారం(జనవరి 25న) జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరకు విజయం భారత్‌నే వరించింది. తెలుగు ఆటగాడు తిలక్‌వర్మ అద్భుతమైన ఆటతో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో చివరి వరకు నిలిచి టీమిండియాను గెలిపించాడు. 55 బాల్స్‌లో 72 పరుగులతో అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. లక్ష్య ఛేదనలో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఇంగ్లాండ్(England) బౌలర్లకు ఎదురొడ్డి నిలిచి జట్టును గెలిపించాడు. చివరి ఓవర్‌లో టీమిండియా గెలిచింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2–0 ఆధిక్యంలో ఉంది.
గెలిపించిన తిలక్
రెండో టీ20లో తెలుగు క్రికెటర్ తిలక్‌వర్మ(55 బంతుల్లో 72 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయడంతో 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి భారత్ విజయం అందుకుంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే తిలక్‌వర్మ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని సత్తా చాటాడు.
కష్టాల్లో పడిన భారత్
లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(12) సంజూ శాంసన్(50 పరుగులకే ఔట్ అయ్యారు. తొలి ఓవర్‌లో 12 రన్స చేసిన అభిషేక్, రెండో ఓవర్ పెవిలియన్ చేరాడు. అతి తర్వాత ఓవర్‌లో సంజూ ఔట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12), ధ్రువ్ జురెల్(4), హార్దిక్ పాండ్యా(7) పరుగలకే పెవిలియన్ బాట పట్టారు. కాసేపు కూడా నిలవలేకపోయారు. దీంతో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను తిలక్ వర్మ ఆదుకున్నాడు.
తిలక్ సూపర్ షో
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. తిలక్ వర్మ మాత్రం దుమ్ము రేపాడు వాషింగ్‌టన్ సుందర్(26)తో కలిపి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సుందర్, అక్షర్ పటేల్(2), అర్షదీప్‌సింగ్(6) వెంటనే ఔట్ అయ్యారు. అయినా తిలక్ వర్మ దూకుడు కొనసాగిచాడు. పరుగులు రాబట్టాడు. జట్టు గెలుపు వైపు నడిపించాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. గెలుపే లక్ష్యంగా హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకోలేదు. చివరికి రవి బిష్ణోయ్(9 నాటౌట్)తో కలిసి టీమిండియాకు విజయం అందించాడు. చివరి వరకు ఒత్తిడిని తట్టుకని నిలబడి ఎంటి చేత్తో సత్తా చాటాడు. తర్వాత గాల్లోకి ఎగురుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు.
భారత బౌలర్లు అదుర్స్..
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్యాటనికి 165 పరుగులు చేసింది. ఇంగ్లిష్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(4)ను తొలి ఓవర్‌లోనే అర్షదీప్‌సింగ్ పెవిలియన్‌కు పంపించాడు. మరో ఓవర్‌లో బెన్ డకెట్(3)ను వాషింగ్‌టన్ సుందర్ ఔట్ చేశాడు. మరోవైపు జోస్ బల్డర్ 45 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్కులుకొట్టాడు. ఇక హ్యారీ బ్రూక్ (13)ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. కాసేపటికి బట్లర్‌ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు కస్టాల్లో పడింది. 9.3 ఓవర్లలో 77 పరుగు మాత్రమే చేసింది. లివింగ్ స్టోన్ (13) కూడా త్వరగా పెవిలియన్ చేరాడు.
దూకుడుగా ఆడిన లోయర్ ఆర్డర్
ఇంగ్లండ్ లోయర్ ఆర్డన్ బ్యాటరు అదర గొట్లారు. ముందు జెమీ స్మిత్(12 బంతుల్లో 22 పరుగులు) చేశారు. బిడోన కార్సే 17 బంతుల్లో 31 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదింది భారత్ గెలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జనవరి 28న రాజ్కోట్లో జరగనుంది.