https://oktelugu.com/

Pan India Movie: రజినీకాంత్, ప్రభాస్ కాదు… అసలు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ చేసిన హీరో ఎవరో తెలుసా? ఆ సినిమా ఏమిటంటే?

ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్డం, మార్కెట్ తో సంబంధం లేకుండా చాలా మంది హీరోలు పలు భాషల్లో తమ చిత్రాలు విడుదల చేస్తున్నారు. సౌత్ లో పాన్ ఇండియా హీరోలు అంటే మనకు మొదట రజినీకాంత్, ప్రభాస్ గుర్తొస్తారు. కానీ మూడు దశాబ్దాల క్రితమే బాహుబలి రేంజ్ బడ్జెట్ తో ఓ స్టార్ హీరో పాన్ ఇండియా మూవీ చేశాడు. ఆ హీరో ఎవరు? చిత్రం ఏమిటీ?

Written By: , Updated On : January 26, 2025 / 08:33 AM IST
Pan India Movie

Pan India Movie

Follow us on

Pan India Movie: ప్రభాస్, అల్లు అర్జున్ టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరోలుగా ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలకు కూడా నార్త్ లో కొంత మార్కెట్ ఉంది. కన్నడ పరిశ్రమకు చెందిన యష్ కెజిఎఫ్ సిరీస్ తో ఇండియా వైడ్ పాపులారిటీ రాబట్టారు. ఈ జనరేషన్ స్టార్స్ లో ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియా హీరో. ఆయన నటించిన బాహుబలి 2 అనేక రికార్డులు నమోదు చేసింది. అనంతరం ప్రభాస్ నటించిన సాహో, కల్కి సైతం నార్త్ లో ఆదరణ దక్కించుకున్నాయి.

ఇక పుష్ప 2 ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. నార్త్ ని పుష్ప 2 దున్నేసింది. లోకల్ స్టార్స్ రికార్డులు తుడిచిపెట్టుకునిపోయాయి. బాహుబలి అనంతరం పాన్ ఇండియా కాన్సెప్ట్ బాగా ప్రాచుర్యం పొందింది. అయితే గతంలో కోలీవుడ్ లో తెరకెక్కిన కొన్ని చిత్రాలు నార్త్ లో సత్తా చాటాయి. ముఖ్యంగా రజినీకాంత్ నార్త్ ఆడియన్స్ కి సుపరిచితుడే. ఆయన కొన్ని హిందీ ప్రాజెక్ట్స్ చేశారు. రోబో, 2.0 హిందీలో కూడా ఆడాయి.

రక్షకుడు

రక్షకుడు

కాగా బాహుబలి కంటే ముందే ఒక టాలీవుడ్ స్టార్ భారీ బడ్జెట్ మూవీ చేశాడు. చెప్పాలంటే అదే ఫస్ట్ సౌత్ ఇండియన్ పాన్ ఇండియా మూవీ అంటారు. ఆ చిత్రం పేరు రక్షకుడు. కింగ్ నాగార్జున హీరోగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో రక్షకుడు చిత్రీకరించారు. సుస్మితా సేన్ హీరోయిన్ గా నటించింది. రఘువరన్, గిరీష్ కర్నాడ్ వంటి నటులు కీలక రోల్స్ చేశారు. రక్షకుడు చిత్రానికి ప్రవీణ్ గాంధి దర్శకత్వం వహించాడు.

భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో రాక్షసుడు మూవీ తెరకెక్కించారు. అప్పటికే నాగార్జున కొన్ని హిందీ చిత్రాల్లో నటించారు. రక్షకుడు చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పాటలు అద్భుతంగా ఉంటాయి. అంచనాల మధ్య రక్షకుడు విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ అయితే నాగార్జున రేంజ్ మరోలా ఉండేది. 1997 అక్టోబర్ 10న విడుదలైన రాక్షసుడు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మూవీ బాక్సాఫీస్ వర్క్ అవుట్ కాలేదు. నాగార్జునతో పాటు రాక్షసుడు యూనిట్ చాలా నిరాశకు గురయ్యారు. బడ్జెట్, భారీతనం రీత్యా రక్షకుడు మూవీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అంటారు. అదన్నమాట మేటర్.