India Vs South Africa: ఇండియా సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన టి20 సిరీస్ లో భాగంగా నిన్న ఆడాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక ఇది ఇలా ఉంటే రేపు రెండో టీ20 మ్యాచ్ కి రెండు టీములు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. మొదటి మ్యాచ్ రద్దవ్వకుండా కొన్ని ఓవర్ల మ్యాచ్ ఆడితే బాగుండేదని అందరూ అభిప్రాయపడుతున్నారు.కానీ అవుట్ ఫీల్డ్ మొత్తం తడవడం వల్ల మ్యాచ్ సాగే పరిస్థితి కనిపించకపోవడం తో ఈ మ్యాచ్ ని రద్దు చేశారు. అయితే రేపు మాత్రం వర్షం వచ్చిన కూడా కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయిన ఆడడాని ప్రయత్నం చేసే విధంగా సౌతాఫ్రికా బోర్డ్ కీలకమైన చర్యలను చేపడుతుంది.
ఇక రేపు జరగాల్సిన ఇండియా సౌతాఫ్రికా రెండో టి20 మ్యాచ్ లో ఇండియన్ టీం ఎలాంటి కసరత్తులతో బరిలోకి దిగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇక ఇప్పటికే ఓపెనర్లుగా శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్ రంగంలోకి దిగుతారనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి రుతురాజ్ గైక్వాడ్ ఫైనల్ టీం లో ఉంటాడా లేదా అనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది.ఒక వేళ గైక్వాడ్ ఉంటే అతన్ని ఏ ప్లేస్ లో ఆడిస్తారు. జైస్వాల్, గైక్వాడ్ ఇద్దరిలో ఎవరినో ఒక్కరిని మాత్రమే టీంలోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మిగతా ప్లేయర్లందరు కూడా ఎవరి స్లాట్ లో వాళ్ళు ఉండడంవల్ల ప్లేయార్లను మార్చే అవకాశం అయితే కనిపించడం లేదు.
ఇక ముఖ్యంగా వీళ్లిద్దరి మధ్యనే తీవ్రమైన పోటీ నెలకొంది.కాబట్టి ఇద్దరిలో ఒకరు మాత్రమే ఫైనల్ టీమ్ లో ఉంటారు.వాళ్ళు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదే క్రమంలో ఇండియన్ టీం తన సత్తా చాటాలి అంటే రెండవ టి20 మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలి.ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇండియన్ టీం ఆల్మోస్ట్ సిరీస్ ని కైవసం చేసుకున్నంత పని చేసినట్టే ఇలా చేస్తే మూడో టి20 సిరీస్ లో గెలవడం ఈజీ అవుతుంది.
అందువల్ల ఈ రెండో టి20 మ్యాచ్ అనేది ఇండియన్ టీం కి చాలా కీలకంగా మారింది…అందుకే టీమ్ లో ఎలాంటి ప్లేయర్ ఉండాలి అనేది కెప్టెన్ సూర్య మీదనే ఆధారపడి ఉంది…తను కనక ఫైనల్ టీమ్ సెలక్షన్ లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా ఈ మ్యాచ్ ఓటమి కి కారణం తనే అవుతాడు…